English | Telugu

Brahmamudi : రాజ్, కావ్య కలుస్తారా.. ఒకే హాస్పిటల్ కి ఇద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -674 లో.....రాజ్ విషయంలో ఛాన్స్ తీసుకోను.. డాడీ గతంని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను కానీ ఆ గతంలో నేను మాత్రమే ఉన్నానని క్రియేట్ చేస్తాను.. అప్పుడే రాజ్ నాతో క్లోజ్ గా ఉండడం స్టార్ట్ చేస్తాడని తన పేరెంట్స్ తో యామిని అంటుంది. అప్పుడే రాజ్ వచ్చి ఏం డిస్కస్ చేసుకుంటున్నారని అడుగుతాడు. ఏం లేదు రామ్.. రేపు నువ్వు హాస్పిటల్ కి వెళ్ళాలి కదా దాని గురించి అని యామిని కవర్ చేస్తుంది.

ఆ అమ్మాయిని కూడా అదే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాను కదా.. అక్కడికి వెళ్తే తన గురించి ఏమైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఆ అమ్మాయి నాకూ పదేపదే గుర్తుకుస్తుంది తెలుసుకోవాలని రాజ్ అనుకుంటాడు. మరోకవైపు కావ్య పరిస్థితి చూసి ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు బాధపడతారు. రోజు, రోజు కి ఇలా ప్రవర్తిస్తుందని అనుకుంటారు. కావ్య దగ్గరికి స్వప్న, అప్పు ఇద్దరు వెళ్తారు. ఇంట్లో వాళ్ళు నిన్ను అలా అంటున్న ఏం పట్టించుకోవా అని స్వప్న అడుగుతుంది. ఏం అంటారు పిచ్చి పట్టింది అంటారు అంతేగా అని కావ్య అంటుంది. పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావని స్వప్న అనగానే నువ్వు కూడా అలాగే అంటున్నావని కావ్య అంటుంది. అక్క అంత అంటున్నప్పుడు బావ ఉన్నాడని ఎందుకు అనుకోకూడదు.. బావ గురించి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తానని అప్పు అంటుంది. అప్పు ఇన్వెస్టిగేషన్ చేసేలోపు మా ఆయనని ఇంటికి తీసుకొని వస్తానని కావ్య అంటుంది.

రాహుల్, రుద్రాణి ఇద్దరు కంపెనీని సొంతం చేసుకోవాలని అందుకు అడ్డుగా ఉన్న కావ్యని తొలగించాలని ప్లాన్ చేస్తారు. రుద్రాణి, రాహుల్ కలిసి రాజ్ ఫోటో దగ్గరికి వెళ్లి దీపం పెట్టాలని చూస్తుంటే కావ్య పరిస్థితి గురించి తెలిసే ఇలా చేస్తున్నావా అంటూ ఇందిరాదేవి కోప్పడుతుంది. అయినా వినకుండా రుద్రాణి దీపం పెడుతుంటే.. అప్పుడే కావ్య వచ్చి రుద్రాణి చెయ్ ఆపుతుంది. మీకు చెప్తే వినపడడం లేదా అంటూ రుద్రాణి గొంతు పట్టుకుంటుంది కావ్య. తరువాయి భాగంలో హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన అమ్మాయి డీటెయిల్స్ అంటూ రాజ్ హాస్పిటల్ కి వెళ్లి అడుగుతాడు. అదే హాస్పిటల్ కి కావ్య వెళ్లి నన్ను అడ్మిట్ చేసిన అతని డీటెయిల్స్ అంటూ కావ్య అడుగుతుంది అతను ఇక్కడే ఉన్నాడని రిసెప్షన్ లో చెప్పగా.... డాక్టర్ తో మాట్లాడుతున్న రాజ్ ని కావ్య చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.