English | Telugu

Bigg boss 9 Telugu Double Elimination:  డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు.. ఈ సారి డబుల్ ఎలిమినేషన్!


బిగ్ బాస్ సీజన్ 9 పై భారీ అంచనాల మధ్య మొదలైంది. ఆ అంచనాలకి తగ్గట్టుగానే బిగ్ బాస్ మంచి హైప్ ని క్రియేట్ ని చేస్తున్నాడు. ఈ వారం రాము కెప్టెన్ కాబట్టి నామినేషన్ లో లేడు. ఇమ్మ్యూనిటీ పొంది ఇమ్మాన్యుయల్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇక భరణి, దివ్య, కళ్యాణ్, తనూజ టాస్క్ లు గెలిచి సేఫ్ జోన్ లో ఉన్నారు.

అయితే ఈ వీక్ లో ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. సుమన్ శెట్టి మొదటి స్థానంలో ఉండగా సంజన రెండో స్థానంలో, శ్రీజ మూడో స్థానంలో, డీమాన్ నాలుగో స్థానంలో ఉన్నారు. రీతూ, ఫ్లోరా సైనీ ఇద్దరు మాత్రం లీస్ట్ లో ఉన్నారు. ఈ వారం రీతూ, ఫ్లోరా వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఆటతో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు. అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ సీజన్ లో డబుల్ ఎలిమినేషన్ ఇదే మొదటిసారి అవుతుంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరా, రీతూ చౌదరి ఇద్దరు వెళ్లే అవకాశం ఉంది.

డబుల్ ఎలిమినేషన్ ఉంటే శనివారం నాటి ఎపిసోడ్ లో ఒకరికని, ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఇంకొకరిని పంపిస్తారు.. సండే రోజు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉండబోతుంది. ఈ 2.0 ఎపిసోడ్ లో అయిదుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే దానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే జరిగిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.