English | Telugu
Bigg Boss 9 Telugu : నామినేషన్ లో బిగ్ ట్విస్ట్.. పవర్ మొత్తం వైల్డ్ కార్డ్స్ దే!
Updated : Oct 14, 2025
బిగ్ బాస్ సీజన్-9 అయిదు వారాలు పూర్తయ్యాయి. ఇక ఆరో వారం మొదలైంది. సోమవారం రానే వచ్చేసింది.. వీక్ లో అన్ని రోజులు ఒక ఎత్తు అయితే సోమవారం నామినేషన్ ప్రక్రియ ఒక ఎత్తు అవుతుంది. ఈ సారి బిగ్ బాస్ నామినేషన్ డిఫరెంట్ గా ప్లాన్ చేసాడు. బజర్ వచ్చినప్పుడు పై నుండి బాల్ వస్తుంది. అది వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఎవరైనా పట్టుకొని వాళ్లకు నచ్చిన కంటెస్టెంట్స్ కి ఇవ్వొచ్చు. వాళ్ళు కేవలం వైల్డ్ కార్డ్స్ ని కాకుండా మిగిలిన కంటెస్టెంట్స్ లో ఎవరినైనా ఇద్దరిని నామినేట్ చెయ్యొచ్చు.
మళ్ళీ ఆ ఇద్దరిలో ఒక్కరిని సేవ్ చేసే ఛాన్స్ ఆ బాల్ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కి ఉంటుందని బిగ్ బాస్ చెప్తాడు. మొదటగా బాల్ ని నిఖిల్ పట్టుకుంటాడు. అది తనూజకి ఇస్తాడు. రాము, సుమన్ ఇద్దరిని తనూజ నామినేట్ చేస్తుంది. రాము సంఛాలక్ గా బాగా చేయలేదు.. ఇంకా సుమన్ అన్న ఎప్పుడు నాతో మాట్లాడడం లేదని తనూజ రీజన్ చెప్తుంది. కానీ రాముని నిఖిల్ సేవ్ చేసి సుమన్ ని నామినేషన్ లో ఉండేలా చేస్తాడు. రాము యాక్టీవ్ గా ఉన్నాడు.. సుమన్ యాక్టీవ్ గా లేరని కారణం చెప్తాడు. ఆ తర్వాత రమ్య బాల్ పట్టుకుంటుంది. ఆ బాల్ రాముకి ఇస్తుంది.
రీతూ, డీమాన్ పవన్ ఇద్దరిని రాము నామినేట్ చేస్తాడు. మీరు ఇద్దరు బెలూన్ టాస్క్ లో ఫౌల్ ఆడారు. అందుకే నామినేట్ చేస్తున్నానని రీజన్ చెప్తాడు. కానీ రీతూని రమ్య సేవ్ చేసి డీమాన్ పవన్ ని నామినేషన్ లోకి వెళ్లాలా చేస్తతుంది. రీతూ అన్నింట్లో స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ డిమాన్ పవన్ కి బుర్ర లేదని రమ్య చెప్తుంది. ఎక్కడ అలా అనిపించింది ఒక ఉదాహరణ చెప్పండి అని డీమాన్ అడుగగా ఒక్క దగ్గర కాదు అన్ని చోట్ల అని రమ్య అంటుంది. ప్రస్తుతం నామినేషన్ లో సుమన్, డీమాన్ ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. నామినేషన్లో మొత్తం ఎంతమంది ఉన్నారో తెలియాలంటే నేడు(మంగళవారం) జరిగే ఫుల్ నామినేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూడాల్సిందే.