English | Telugu

బిగ్ బాస్ సీజన్-8 గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్ధం.. ఎప్పుడంటే!

బిగ్ బాస్ సీజన్- 8 ఇప్పటికే పన్నెండు వారాలు ముగిశాయి. ఇక ‌పదమూడో వారం కంటెస్టెంట్స్ తమ నామినేషన్లతో హీటెక్కించేశారు. చూస్తుండగానే ఫినాలే వీక్ రానే వచ్చింది. ఫినాలే కి మూడు వారాలే ఉన్నాయి.

ఈ సారి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేని భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ గ్రాంఢ్ ఫినాలే డిసెంబరు15 న జరగబోతుందని దానికి సర్వం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పటిలాగే టాప్-5 కంటెస్టెంట్స్ తో అలరించబోతున్నారంట. స్పెషల్ పర్ఫామెన్స్ తో టాలీవుడ్ తారలు కనువిందు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే హౌస్ లో ఇప్పుడు తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో విన్నర్ ఎవరనేది ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చేసింది. విన్నర్ రేస్ లో నిఖిల్, గౌతమ్, నబీల్ ల పేర్లు వినిపిస్తున్నాయి‌.

ఫ్యామిలీ వీక్ తర్వాత కంటెస్టెంట్స్ అంచనాలకి అందని విధంగా తమ ఆటతీరుతో మెప్పిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా టాప్-5 ఫ్యామిలీ మెంబర్స్ ఫినాలే లో సందడి చెయ్యనున్నారు. విన్నర్ కి స్పెషల్ గెస్ట్ చేతుల మీదుగా ట్రోపీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారంట. అయితే గత సీజన్ లలో ఎక్కువ సీజన్ లకి మెగాస్టార్ చీరంజీవి వచ్చాడు. అయితే ఈ సీజన్ కి ఎవరు చీఫ్ గెస్ట్ గా వస్తారనేది అందరిలోను ఆసక్తి ఉంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.