English | Telugu

బిగ్ బాస్ బజ్ యాంకర్ ఎవరో తెలిసిపోయింది...

సెప్టెంబర్ 1న రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే మొదలుకాబోతోంది. ఐతే బిగ్ బాస్ హోస్ట్ ఎవరో తెలుసు కానీ బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ ఎవరు అన్న టాపిక్ ఇప్పుడు అందరిలో ఉంది. ఐతే చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా శివాజీ అన్నారు తర్వాత శోభా అన్నారు..ఇక ఇప్పుడు ఆడియన్స్ ఎదురుచూపులకు క్లారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరో రివీల్ చేశారు. అందుకు సంబంధించి ప్రోమో కూడా విడుదల చేశారు. ఎవరూ ఊహించని పేరు చూసి షాకయ్యారు ఆడియన్స్. ఈసారి బిగ్ బాస్ బజ్ కి యాంకర్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ అంబటి అర్జున్ ని తీసుకున్నారు. అంబటి అర్జున్ చాలా క్లారిటీగా తప్పు చేస్తే ముఖం మీదే చెప్పే మైండ్ సెట్ ఉన్నవాడు. అలాటి వాళ్ళే బిగ్ బాస్ బజ్ కి వస్తే మంచి రేటింగ్ మంచి కాంట్రావర్సీస్ కూడా ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో అంబటి అర్జున్ కి స్వాగతం పలికారు. గత సీజన్స్ లో బిబి కేఫ్, బిగ్ బాస్ బజ్ ని అరియనా గ్లోరీ, శివ, రాహుల్ సిప్లిగంజ్, గీతూ రాయల్ వంటి వాళ్ళు చేశారు. ఇక ఇప్పుడు అంబటి అర్జున్ రాబోతున్నాడు.

ఇక ఈ ప్రోమోలో అంబటి హౌస్ మేట్స్ కి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు కనిపిస్తోంది. “టైమ్ బాగుంటే సంతోషం.. టైమ్ బాగోకపోతే సంకోచం. టైమ్ బాగుంటే మనం ఏం చేసినా ఒప్పు.. అలా టైమ్ బాగున్న కొంతమంది బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారు. మరి వాళ్ల టైమ్ బ్యాడ్ అయితే ? బిగ్ బాస్ బజ్ లోకి వస్తారు. లోపల మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి.. ఈ సీటు యమ హాటు” అంటూ అంబటి అర్జున్ చెప్పిన డైలాగులు బాగా వైరల్ అవుతున్నాయి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.