English | Telugu

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 కన్ఫమ్ కంటెస్టెంట్స్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ నెల చివర్లో మొదలవ్వబోతుంది. అయితే ఇప్పటికి ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తున్నారని చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రతీ సీజన్ లో కామన్ మ్యాన్ ఎవరస్తారనే క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది. అయితే ఈ కేటగిరీ నుండి ఎవరనేది ఇంకా సస్పెన్సుగానే ఉంది. బిగ్ బాస్ గ్రాంఢ్ లాంచ్ రోజు ఎంతమంది ఎంట్రీ ఇస్తారో, వైల్డ్ కార్డుగా ఎంతమంది అనేది ప్రతీ సీజన్ కి ఆసక్తికరంగా ఉంటుంది. ఇలా ఒక్కటేమిటి బిగ్ బాస్ గురించి ప్రతి ఒక్కటి ట్విస్ట్ లాగే ఉంది.

అమరదీప్ భార్య తేజస్విని గౌడ కన్ఫమ్ కంటెస్టెంట్ అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీతు చౌదరి, మై విల్లేజ్ షో అనిల్ జీలా, సీరియల్ యాక్టర్ నవ్య స్వామి, అలేఖ్య చిట్టి పిక్కిల్ చిట్టి, తెల‌ంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ, సీరియల్ యాక్టర్ సాయి కిరణ్, శివ కుమార్, దెబ్జానీలతో పాటు కమెడియన్ ఇమ్మాన్యుయెల్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే వీరితో పాటుగా సింగర్ కేటగిరీ నుండి శ్రీతేజ ఎంట్రీ ఇస్తున్నాడంట. సీరియల్ యాక్టర్ దీపిక రంగరాజు, కేరింత మూవీ హీరో సుమంత్ అశ్విన్ కూడా సీజన్ 9(Bigg Boss 9 Telugu) కి వస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఇంకా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనేది తెలియాలంటే సీజన్ 9 గ్రాంఢ్ లాంఛ్ వరకు ఆగాల్సిందే.



Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.