English | Telugu

Bigg Boss 9 Telugu: బహుబలిలో ప్రభాస్ లా స్పీచ్ ఇచ్చిన సుమన్ శెట్టి.. గూస్ బంప్స్ లోడింగ్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చాక ఆట స్వభావమే మారిపోయింది. నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్స్ మొదటి టాస్క్ లో ‌సుమన్ శెట్టి, గౌరవ్ గెలిచారు. దాని తర్వాత రీతూ వచ్చి సుమన్ శెట్టి నుదుటిపై ముద్దు పెట్టింది.

ఆ తర్వాత గేమ్ లో ఓడిపోయామనే బాధలో కింద కూర్చొని అయేషా ఏడ్చేసింది. నా కన్ను వల్ల పోయింది మేమ్.. నా లోపం వల్ల పోయింది.. నాకు కనబడలేదంటూ అయేషా తన చెంపమీద తానే కొట్టుకుంటూ ఏడ్చేసింది. దీంతో అందరు తనని ఓదార్చడానికి వచ్చారు. నేనే ఫస్ట్ వచ్చాను.. అయినా కానీ ఓడిపోయాం.. నా కన్ను వల్ల పోయింది ఇమ్మూ నాకు కనబడలేదు ఇమ్మూ అంటూ అయేషా ఏడ్చింది. ఇది చూసి మాధురి కూడా ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకుంది. దీంతో మాధురి గారు మీరు కూడా ఏడుస్తారేంటి అంటూ అందరూ ఓదార్చారు. కెప్టెన్ అయిన సంతోషంలో అధ్యక్షా.. సుమన్ శెట్టి అను నేను నీతిగా, నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నానని సుమన్ శెట్టి చెప్పాడు. ఇది ఎలా ఉందంటే బహుబలి సినిమాలో పట్టాభిషేకం అప్పుడు ప్రభాస్ స్పీచ్ ఇచ్చాడు కదా అచ్చం అలాగే ఉంది. ఇది సుమన్ శెట్టి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే ఎపిసోడ్ గా నిలిచిపోయింది. కాసేపటికి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంట్లో ఇద్దరు కెప్టెన్లు ఉంటారని బిగ్ బాస్ చెప్తాడు.

గౌరవ్-నిఖిల్ ఇద్దరికీ 'గెలుపు కొరకు చివరి వరకూ'.. అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. పోటీదారులు తమ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కర్రలపై నిలబడి రోప్స్‌కి కట్టిన వెయిట్ బ్యాగ్స్‌ని హ్యాండిల్స్ ద్వారా లాగుతూ కాళ్లు కిందపెట్టకుండా బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి.. బజర్ మోగిన ప్రతిసారీ సంచాలకులు చెప్పినన్ని వెయిట్ బ్యాగ్స్‌ని తను పిలిచిన ఇంటి సభ్యులు కెప్టెన్ అవ్వకూడదనుకునే పోటీదారుని రోప్‌కి హుక్ చేయాల్సి ఉంటుందంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. ఈ టాస్కుకి తనూజ సంచాలక్. టాస్క్ మొదలుకాగానే నిఖిల్ కంటే గౌరవ్ చాలా స్ట్రాంగ్‌గా బలంగా కనిపించాడు. గేమ్ కూడా అలానే జరిగింది. కాసేపటికి నిఖిల్ తన చేతికి ఉన్న రోప్‌ని మోయలేక వదిలేశాడు. దీంతో టాస్కులో గెలిచి మళ్లీ గౌరవ్ కెప్టెన్ అయిపోయాడు. ఇక కెప్టెన్స్ ఇద్దరూ మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకున్నారు. అయేషాకి పడుకోవడానికి బెడ్ లేదు కనుక.. నువ్వు ఇంకో ఇద్దరు అమ్మాయిలతో కలిసి కెప్టెన్ రూమ్‌లో పడుకోవచ్చు.. మిగిలిన బెడ్స్‌పై బయట మేము పడుకుంటామని సుమన్ చెప్పాడు. ఈ మాట చెప్పగానే అయేషా సహా లేడీస్ అందరూ క్లాప్స్ కొట్టారు. ఫస్ట్ బంతికే సిక్సర్ కొట్టావన్నా అంటూ మిగిలిన వాళ్లు అరిచారు. మరి సుమన్ శెట్టి కెప్టెన్ గా గెలవడం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.