English | Telugu

‘పెన్ను కదలట్లేదురా సుధీర్, శీను.. వచ్చేయండిరా’

ఎక్స్ట్రా జబర్దస్త్ చరిత్రలో ఆడియన్స్ ఎప్పుడు నవ్వడమే చూసాం.. ఏడుపనేది తెలీకుండా స్కిట్స్ పెర్ఫార్మ్ చేసేవాళ్ళు కమెడియన్స్. కానీ ఈ వరం ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ చూసి ఏడవని ఆడియన్ అంటూ ఎవరూ లేరు. ఎందుకంటే ఆటో రాంప్రసాద్ స్టేజి మీద ఏడ్చేసరికి టీం మొత్తం అతనికి అండగా నిలబడ్డారు. మేం ఉన్నాం నీ పక్కన ధైర్యంగా ఉండు అన్న అంటూ భరోసా ఇచ్చారు. ఐనా ఏడుపు ఆపులేకపోయాడు రాంప్రసాద్.

ఇంతలో ఇంద్రజ వెళ్లి రాంప్రసాద్ ని హగ్ చేసుకుని 'నువ్ జీవితంలో చాలా గొప్ప స్థాయికి వెళ్తావ్ మేము నిన్ను చూసి మా రాంప్రసాద్ అంటూ చెప్పుకుంటాం ఆ క్షణాలు త్వరలోనే వస్తాయి' అంటూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. 'ఒక కంచంలో తిన్నాం ఒకే మంచంలో పడుకున్నాం. కానీ ఈరోజు నేను ఒంటరి అనే ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళు నాతో ఉంటే అలా పక్కకెళ్లి స్కిట్ అరగంటలో రాసేసి తీసుకొచ్చేసేవాడిని అంత ధైర్యంగా ఉండేది నాకు. కానీ ఇప్పుడు రెండు మూడు రోజులు గడుస్తున్నా స్కిట్ రాయలేకపోతున్న. నాకు ఫుడ్ పెట్టిన ఈ స్టేజి మీద బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా కానీ అస్సలు నా వల్ల కావడం లేదు.. పెన్ను కదలట్లేదురా.. ఎక్క‌డున్నా వచ్చేయండిరా సుధీర్, శీను' అంటూ స్టేజి మీద ఏడ్చేశాడు రాంప్రసాద్.

ఒకడు హీరోగా, ఒకడు మంచి ఆర్టిస్ట్ గా, నేను రైటర్ గా ఎప్పటికైనా కలుస్తాం అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు రాంప్రసాద్.. ఇక వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్న మూమెంట్స్ ని ప్లే చేయడంతో రాంప్రసాద్ ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ స్కిట్ చాలా వైరల్ అవుతోంది. వీళ్లది రియల్ ఫ్రెండ్షిప్, సుధీర్, శీను మళ్ళీ ఈ స్టేజి మీద స్కిట్ చేయాలి, వీ మిస్ యూ సుధీర్ అన్న అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.