English | Telugu

అధికారం కోసం ఓ అత్త... మమకారం కోసం కోడళ్ళు

'దేవతలారా దీవించండి' అనే అద్భుతమైన సీరియల్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన జీ తెలుగు, ఇప్పుడు 'కోడళ్ళు మీకు జోహార్లు' అనే మరో ఆసక్తికరమైన సీరియల్ తో ఈ సోమవారం నుండి ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. అత్తాకోడళ్ల ఆధిపత్యపోరు నేపధ్యంగానే వస్తున్నప్పటికీ, ఈ సీరియల్ కాస్త భిన్నంగా హాస్యభరిత మరియు ప్రతీకార సన్నివేశాలతో తెరకెక్కించబడింది. ఈ సీరియల్ ప్రతి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రసారం కానుంది.

పవిత్ర, కౌస్తుభా మని, దుర్గశ్రీ, మరియు నాగార్జున ప్రధానపాత్రదారులుగా వస్తున్న ఈ సీరియల్, ఇప్పటికే విడుదలైన ప్రోమోతో అందరిని ఆకట్టుకుంటుంది. కథలోపటికీ వెళ్తే, కుటుంబ సభ్యులని మోసంచేస్తూ రేఖ (పవిత్ర) తన అక్కకొడుకు శేఖర్ నుండి కుటుంబవ్యాపారాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. అంతేకాకుండా, వ్యాపారంలో తన కొడుకు తారక్ (నాగార్జున) పలుకుబడిని పెంచుకుంటూ పోతుంది. తన అధిపత్యానికి ఎటువంటి హాని కలగకూడదని, సున్నితస్థురాలైన మిథునని (కౌస్తుభా మని) ఇంటి కోడలిగా తెచ్చుకుంటుంది. ఐతే, మిథున చెల్లెలైన వైష్ణవి (దుర్గశ్రీ) ఎప్పటికప్పుడు రేఖ ఆగడాలకు మరియు తన ఆధిపత్యకాంక్షలకు అడ్డుకట్టవేస్తూ తన అక్కని కాపాడుకుంటూవస్తుంది.

ఈవిధంగా, రేఖ మరియు మిథున మధ్య జరిగే ఆధిపత్యపోరాటం కొన్నిసార్లు నవ్వులుపూయిస్తూ మరికొన్ని సార్లు ఉద్వేగాన్ని రేకెత్తిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తుంది.ఈ సీరియల్ ప్రారంభోత్సవం సందర్బంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ (తెలుగు) శ్రీమతి అనురాధ గూడూరు మాట్లాడుతూ, 'కోడళ్ళు మీకు జోహార్లు' సాధారణంగా అత్తాకోడళ్ల నేపథ్యంలో వచ్చే కథాంశాలకన్నా భిన్నంగా ఉంటుందని, ఇందులోని సన్నివేశాలు నిజజీవితంలో ఒక సాధారణ కుటుంబంలో జరిగే సంఘటనలకు దగ్గరగా ఉంటాయని చెప్పారు. అలాగే ఈ సీరియల్ పాసిటివిటీని పెంపోందిస్తుందని, ప్రేక్షకులు కచ్చితంగా ఈ వినూత్న కథాంశాన్ని ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.