English | Telugu
అమ్మతో కలిసి ఓనం సెలెబ్రేట్ చేసుకున్న సుమ!
Updated : Sep 10, 2022
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏ షోలో ఐనా ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఆట పట్టిస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఇన్స్టా లో పోస్ట్లు పెడుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటుంది.
ఇక ఇప్పుడు సుమ లేటెస్ట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇటీవల సుమ వాళ్ళ అమ్మతో కలిసి ఎక్కువగా సందడి చేస్తూ కనిపిస్తోంది. ఆమె 80వ పుట్టిన రోజు, వరలక్ష్మీ వ్రతం చీర అంటూ సుమ షాపింగ్ చేయించింది. వాళ్ళ అమ్మ బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది.
సుమ కేరళ కుట్టి అని అందరికీ తెలుసు ఇక ఇప్పుడు సుమ వాళ్ళ ఇంట్లో చేసుకున్న ఓనం ఫెస్టివల్ వీడియోని షేర్ చేసేసరికి అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజీవ్ కనకాల సుమ తలలో పూలు పెడుతూ ఇద్దరూ ఎంతో చూడముచ్చటగా కనిపించారు. ఓనంకి వేసే స్పెషల్ ముగ్గును కూడా అందంగా డెకరేట్ చేసింది పూలతో. చివరికి చక్కగా భోజనం కూడా ఆరగించింది సుమ. ఇలా వాళ్ళ అమ్మతో కలిసి ఓనం ఫెస్టివల్ ని సెలెబ్రేట్ చేసుకుంది సుమ.