English | Telugu
పవన్ కళ్యాణ్ తర్వాత ఆ రేంజ్ కి వెళ్ళేది అతను మాత్రమే!
Updated : Sep 10, 2022
హైపర్ ఆది బుల్లి తెర మీద ఎంతో ఫేమస్. ఇక అతని పంచ్ డైలాగ్స్ కూడా అదే రేంజ్ లో పేలతాయి. ఇక ఆది పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఏ చిన్న సందర్భం దొరికినా పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒక విషయం చెప్పకుండా మాత్రం ఉండడు. ఇప్పుడు కూడా అదే పని చేసాడు ఆది. ఢీ డాన్స్ షోలో సందడి చేస్తున్న హైపర్ ఆది పవన్ కళ్యాణ్ గురించి ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్ లో కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఇక ఇదే షోకి "నేను మీకు బాగా కావాల్సినవాడిని" సినిమా ప్రమోషన్స్ కోసం కోడి దివ్య, కిరణ్ అబ్బవరం, హీరోయిన్స్ వచ్చారు. "చాలా తక్కువ వయసులో ఎక్కువ సినిమాలు చేసింది కిరణ్ అబ్బవరం.
చిన్నవాళ్లకు అన్నలా, పెద్దవాళ్లకు తమ్ముడిలా, ప్రతీ పేరెంట్ కి ఒక కొడుకులా అనిపిస్తాడు. నాకు పవన్ కళ్యాణ్ గారి మాట కానీ పాట కానీ వింటే నోటికి తెలియకుండా అరుపులు , చేతికి తెలియకుండా చప్పట్లు, వేళ్ళకు తెలియకుండా విజిల్స్ వచ్చేస్తాయి. నాకు మళ్ళీ ఆయన స్థాయికి వెళ్లే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కిరణ్ అబ్బవరం అని అనిపిస్తుంది. అందరూ సినిమాలు చేస్తారు కానీ ప్రొడ్యూసర్స్ కి లాభాలు తెచ్చిపెట్టే హీరో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది కిరణ్ అబ్బవరం మాత్రమే" అంటూ కామెంట్స్ చేసాడు.