English | Telugu

శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫన్నీ wwf ఫైటింగ్ పోటీలు

శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడూ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు wwf తరహాలో ఒక ఫన్నీ ఫైటింగ్ తో వచ్చేసారు కమెడియన్స్ . "భార్యలు పారిపోయారని ఏడుస్తున్న భర్తలు, భర్తలను వదిలించుకుని పారిపోయే వచ్చిన భార్యలు" అనే కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు ఈ వారం. భర్త wwf లో కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ భార్యలు మాత్రం హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు. wwf లో వేసుకునే చెడ్డీలతో, బెల్టులతో వచ్చి ఫన్నీ రెజ్లింగ్ పోటీలు పెట్టుకుంటారు.ఇల్లీగల్ అఫైర్స్ కాండిడేట్స్ అంటూ పంచ్ ప్రసాద్ వాళ్ళందరి గురించి ఇంట్రడక్క్షన్ ఇస్తాడు.

తర్వాత రింగ్ లోకి వెళ్లిన ఆది, సన్నీ రెజ్లింగ్ చేసుకుంటూ మధ్యలో సన్నీ ఆదికి హెడ్ మసాజ్ బాడీ మసాజ్ చేస్తుంటాడు. ఆ సీన్ చూసేసరికి ఆ షోకి వచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్ బాబు పడీ పడీ నవ్వుతారు. తర్వాత ఒక స్కూల్ నుంచి ఒక చిన్నారి వచ్చి నాటీ నరేష్ తో మ్యాజిక్ చేస్తుంది. ఆ మేజిక్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తర్వాత ఆటో రాంప్రసాద్ సరిగా రెజ్లింగ్ చేయకపోయేసరికి నువ్వు చేతబడి చేస్తున్నావా ఫైట్ చేస్తున్నావా అంటూ ఫన్ క్రియేట్ చేసాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.