English | Telugu

అభిమానిని భోజ‌నానికి ఇంటికి ఆహ్వానించిన ర‌వి!

యాంక‌ర్ ర‌వి బిగ్‌బాస్ సీజ‌న్ 5 లో టాప్ 5లో వుంటాడ‌ని అంతా ఊహించారు కానీ అనూహ్యంగా ఎలిమినేట్ కావడం చాలా మందిని షాక్ కు గురిచేసింది. ర‌వి ఏంటీ ఎలిమినేట్ కావ‌డం ఏంటీ? దీని వెన‌క పెద్ద కుట్ర జ‌రిగింద‌ని అత‌ని అభిమానులు పెద్ద ర‌చ్చ చేశారు. ఇక ఇదే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌ని, త‌న ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్ లు చేసిన వారిపై ర‌వి పోలిస్ కంప్లైంట్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read: ఆది కోసం కొట్టుకున్న రోజా, ఆమ‌ని.. ఏంటిది?

అప్ప‌టి నుంచి యాంక‌ర్ ర‌విని సోష‌ల్ మీడివ‌యా వేదిక‌గా కామెంట్ లు చేయ‌డానికి ఎవ‌రూ సాహ‌సించ‌డం లేదు. కానీ ఓ అభిమాని మాత్రం ర‌విని కామెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. యాంక‌ర్ ర‌వి త‌న ఫ్యామిలీకి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. హౌస్ లో ర‌వి చివ‌రి వ‌ర‌కు ఉండ‌లేక‌పోయినా త‌న భార్య‌ నిత్య, పాప వియా ఎంట్రీ ఇవ్వ‌డం అత‌నికి బాగానే క‌లిసి వ‌చ్చింది. వీరి కార‌ణంగా అత‌నిపై వున్న నెగ‌టివ్ ఇమేజ్ పోయింది పాజిటివ్ గా మారింది.

షో నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ద‌గ్గ‌రి నుంచి యాంక‌ర్ ర‌వి ఎక్కువ స‌మ‌యాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తున్నాడు. తాజాగా త‌న పాప వియా కోసం మ‌ట‌న్ వండాడు. దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేశాడు కూడా. అయితే దీనిపై చాలా మంది చాలా ర‌కాలుగా కామెంట్ లు చేశారు. కానీ ఓ లేడీ ఫ్యాన్ చేసిన కామెంట్ కి యాంక‌ర్ ర‌వి రియాక్ట్ అయ్యాడు. ర‌వి షేర్ చేసిన వీడియో చూసిన స‌ద‌రు లేడీ యాంక‌ర్‌.. అబ్బా నోరూరుతోందంటూ కామెంట్ చేస్తే యాంక‌ర్ ర‌వి మురిసిపోయి ఏకంగా ఫ్యాన్ ని ఇంటికే ఆహ్వానించ‌డం ఆక‌ట్టుకుంటోంది. ర‌వి ఊహించని విధంగా త‌న‌ని ఆహ్వానించ‌డంతో స‌ద‌రు లేడీ అభిమాని ఫిదా అయిపోయింది.