English | Telugu

అందరూ రోహిణి మీద పడ్డారు...ఎందుకో తెలిస్తే ...

బుల్లితెర మీద హోలీ సెలెబ్రేషన్స్ బాగానే జరుగుతున్నాయి. షోస్, ఈవెంట్స్ అన్నీ కూడా హోలీ బేస్డ్ గా ప్రోగ్రామ్స్ ని సెట్ చేస్తున్నాయి.. ఇక ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో కూడా రీసెంట్ గా ఒక ప్రోమో రిలీజ్ చేసింది. ఇది కూడా హోలీ ఎపిసోడ్. ఈ షోకి అంబటి అర్జున్, రోహిణి, యాష్మి గౌడ, పల్లవి గౌడ, యాదమ్మ రాజు, జబర్దస్త్ ఇమ్మానుయేల్, పృద్వి శెట్టి, సుహాసిని, ప్రిన్సి, నిఖిల్. ఇక శ్రీముఖి ఐతే అందరికీ హోలీ రంగులు పోసేసింది. తర్వాత యాష్మి గౌడాని పిలిచి హోలీ ఆడే అలవాటు ఉందా అని అడిగింది. యాష్మి లేదు అని చెప్పింది.

"ఎందుకంటే నువ్వు ఆడితే కందిపోతావ్ కాబట్టి" అంటూ శ్రీముఖి ఆన్సర్ ఇచ్చింది. తర్వాత జెంట్ యాక్టర్స్ ని ఒక ప్రశ్న అడిగింది.. " ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో వీళ్లతోనే నా హోలీ అంతా జరుపుకుంటాను అనే అమ్మాయి ఎవరు" అని అడిగింది. అంబటి అర్జున్, పృద్వి, నిఖిల్ అందరూ కూడా రోహిణి రోహిణి అంటూ చూపించారు. ఆ మాట విన్న ప్రిన్సి ఐతే "అందరూ రోహిణి మీద పడ్డారు" అంటూ నవ్వింది. దాంతో రోహిణి తనను అవమానిస్తున్నారని అనుకుని "ఏ నాకేం తక్కువ" అని అడిగింది. తర్వాత జబర్దస్త్ ఇమ్మానుయేల్ వచ్చి "రోహిణి అక్కను సెలెక్ట్ చేసుకుంటే ఇంటికి వెళ్ళాక ఎవరూ ఏమీ అనరు" అని సెటైర్ వేసాడు. ఆ మాటకు రోహిణి చాలా హర్ట్ అయ్యింది...తన ప్లేస్ నుంచి వచ్చి ఇమ్ముని బాగా వాయించేసింది. ఇలా నెక్స్ట్ వీక్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం హోలీ స్పెషల్ గా రాబోతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.