English | Telugu

మాన్సూన్ టైములో బెడ్ రూమ్ లోకి వెళ్ళి..బెడ్ షీట్ తీసి..మణికొండలో ఇదే టాక్

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ని మాన్సూన్ స్పెషల్ గా డిజైన్ చేశారు. అసలే వర్షాలు పడుతున్నాయి. కూల్ వెదర్ లో క్యూట్ థాట్స్ కాన్సెప్ట్ లో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఈ ఎపిసోడ్ కి ఆకర్ష్ బైరాముడి - ఐశ్వర్యరాజ్ ప్రేరణ - శ్రీపాద్, ప్రియాంక జైన్ - శివ్, కీర్తి భట్ - విజయ్ వచ్చారు. ఇక శ్రీముఖి ఐతే ప్రతీ వారం కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొచ్చేది. కానీ ఈ ఎపిసోడ్ కి మాత్రం చక్కగా శారీ కట్టుకుని క్యూట్ లుక్ తో లూజ్ హెయిర్ తో వచ్చింది. "సడెన్ గా వర్షం పడడం స్టార్ట్ అయ్యింది. మీ ఇంట్లో మీరిద్దరు ఉన్నారు అనుకోండి. అప్పుడు రొమాన్స్ గురించి నీ ఐడియా ఏమిటి" అని అడిగింది.

అప్పుడు ఆకర్ష్ వచ్చి "మొన్ననే వచ్చింది వర్షం. ఏమీ లేదు..బాల్కనీ క్లీనింగ్." అని చెప్పేసరికి అందరూ నవ్వారు. తర్వాత ఇదే ప్రశ్నకు శ్రీపాద్ ఐతే "బెడ్ రూమ్ లోపలికి వెళ్ళిపోయి..చక్కగా బెడ్ షీట్ తీసి ఉతకడానికి వేసి కొత్త బెడ్ షీట్ వేసుకుంటా" అని చెప్పాడు. ఈ ఆన్సర్ ని చాలా స్లోగా చెప్తున్నప్పుడు ప్రేరణ- శ్రీపాద్ మధ్యలో ఇంకెందన్న రొమాన్స్ విషయం చెప్తాడేమో అంటూ అవినాష్, శ్రీముఖి తెగ కేకలు వేస్తూ హడావిడి చేశారు. కానీ బెడ్ షీట్స్ మార్చాలి అని చప్పటి ఆన్సర్ చెప్పేసరికి శ్రీముఖి పాపం "సరిపోయారు" అంటూ సప్పగా చెప్పింది. తర్వాత శివ్ వైపు వెళ్లి "ఏంటి నువ్వు మాన్సూన్ రాగానే చాలా రొమాంటిక్ మారతావని మణికొండలో టాక్ . ఏమంటావ్" అని అడిగింది. దానికి శివ్ - ప్రియాంక తెగ సిగ్గుపడిపోయారు. మరి వీటికి ఈ జోడీలంతా ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో రొమాన్స్ విషయంలో వీళ్ళ ఐడియా ఏంటో సండే ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.