మారుతి మూవీలో డ్యూయల్ రోల్.. తాత పాత్రలో ప్రభాస్!
ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్-k' వంటి భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనూహ్యంగా మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా కమిట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేశారు. కానీ ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.