English | Telugu

'ఎన్టీఆర్ 30'లో మృణాల్ ఠాకూర్!

'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు తాజాగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది.

 

'ఎన్టీఆర్ 30'లో హీరోయిన్ గా మొదట బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పేరు వినిపించింది. కానీ పెళ్లి కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక అప్పటి నుంచి హీరోయిన్ గా ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, జాన్వీ కపూర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆ తర్వాత సాయి పల్లవి, కృతి శెట్టి, శ్రీలీల ఇలా ఎందరో యంగ్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు మూవీ టీమ్ మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

 

ఇటీవల విడుదలైన 'సీతా రామం' చిత్రంలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ మెప్పించింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆమెకి ఇప్పటికే నార్త్ లో మంచి గుర్తింపు ఉంది. 'ఎన్టీఆర్ 30' పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో పాటు, అందులో హీరోయిన్ పాత్ర నటనకు ప్రాధాన్యం ఉన్నది కావడంతో మృణాల్ అయితేనే కరెక్ట్ అని మూవీ టీమ్ భావిస్తోందట. మరి 'ఎన్టీఆర్ 30'లో తారక్ కి జోడీగా నటించేది  మృణాలో కాదో త్వరలోనే తేలిపోనుంది.