English | Telugu

హీరోయిన్ గా సాహితి ? హీరో ఎవరో..?

టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాకేష్ మాస్టర్ శిష్యుడిగా సినీ రంగ ప్రవేశం చేసాడు శేఖర్. ఆ తరువాత తనకున్న  టాలెంట్ తో రాణించి స్టార్ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు . అనేకమంది స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ చేస్తూనే  బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చాడు. డాన్స్ షోస్ కి జడ్జిగా చేస్తూ ఇక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించాడు. అలాగే శేఖర్ మాస్టర్ కొడుకు విన్నీ, కూతురు సాహితికి కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ఇక  శేఖర్ మాస్టర్ కొడుకు విన్నీ "అంటే సుందరానికి" మూవీలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.

అలాగే  శేఖర్ మాస్టర్ కూతురు సాహితి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఆమెకు ఫాన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నారు. ఐతే ఇప్పుడు సాహితి గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి లీక్ అయ్యింది. అధికారికంగా కాకపోయినా ఏమో జరిగినా జరగొచ్చు అన్నట్టుగా ఉంది ఆ న్యూస్. శేఖర్ మాస్టర్ కూతురు సాహితి హీరోయిన్ గా మూవీస్ లోకి  ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఒక కొత్త డైరెక్టర్ ఆమెకు కథ కూడా చెప్పేశారని  శేఖర్ మాస్టర్ కు కూడా కథ నచ్చేయడంతో  సినిమా చేయడానికి  గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని  తెలుస్తోంది. ఇప్పటికే సాహితీ, విన్నీ ఇద్దరూ తమ యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఐతే సాహితి ఇప్పుడు హీరోయిన్ గా మారే అవకాశం ఉండనే న్యూస్ మాత్రం  టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.