English | Telugu

'SSMB29'లో హీరోయిన్ గా ఆలియా భట్!

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 29 సినిమాగా రానున్న ఈ అడ్వంచ‌ర్ ఫిల్మ్ లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

 

'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ కి జోడీగా సీత పాత్రలో ఆలియా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్ర నిడివి చాలా తక్కువ ఉండటం పట్ల ఆలియా డిజప్పాయింట్ అయిందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ నిజానికి ఆ మూవీ టైంలోనే తన నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా తీసుకుంటానని ఆలియాకి రాజమౌళి మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మాట ప్రకారమే 'SSMB 29'లో మహేష్ కి జోడీగా ఆలియాను ఫైనల్ చేసినట్లు సమాచారం.

 

మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ లోపు రాజమౌళి ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, 'SSMB 29'ని వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ఆలియా కూడా ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు చిన్న విరామం ఇచ్చింది. వచ్చే ఏడాది 'SSMB 29' సెట్స్ లో అడుగుపెట్టి గ్రాండ్ రీఎంట్రీ ఇస్తుందని న్యూస్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.