English | Telugu
పరశురామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్!
Updated : Aug 24, 2022
'పుష్ప: ది రైజ్' సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే 'పుష్ప-2' తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏంటి అనే దానిపై క్లారిటీ లేదు. బోయపాటి శ్రీను సహా పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా మరో డైరెక్టర్ పేరు తెరమీదకు వచ్చింది. రీసెంట్ గా డైరెక్టర్ పరశురామ్ చెప్పిన కథకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు న్యూస్ వినిపిస్తోంది.
'గీత గోవిందం'(2018) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత 'సర్కారు వారి పాట'(2022) రూపంలో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు పరశురామ్. అయితే ఈ సినిమాతో పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయిన ఆయన.. తాజాగా మెడికల్ మాఫియా నేపథ్యంలో ఓ స్టోరీ లైన్ అనుకున్నాడట. అంతేకాదు దీనిని బన్నీకి విపించగా, ఆయనకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తోంది.
'పుష్ప-2' తర్వాత బన్నీ చేయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయనడంలో సందేహం లేదు. మెడికల్ మాఫియా నేపథ్యంలో పరశురామ్ చెప్పిన లైన్ కి పాన్ ఇండియా అప్పీల్ ఉండటంతోనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది.