English | Telugu

గుడ్ న్యూస్ చెప్పిన సమంత..జనవరి 12 న ఫిక్స్ 

సమంత,(samantha)వరుణ్ ధావన్(varun dhawan)కాంబోలో హిందీలో తెరకెక్కిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ(citadel honey bunny).2023 లో హాలీవుడ్ లో తెరకెక్కిన సిటాడెల్ వెబ్ సిరీస్ కి రీమేక్ గా హనీ బన్నీ తెరకెక్కగా ఫ్యామిలి మ్యాన్ వెబ్ సిరీస్ ని తెరక్కించిన దర్శక ద్వయం రాజ్ డి కె(raj&DK)ద్వయం దర్శకత్వం వహించడం జరిగింది. ఇక ఈ సిరీస్ నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్  అవుతుండగా మంచి ప్రేక్షాదరణని పొందుతుంది.

ఇప్పుడు ఈ మూవీ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే క్రిటిక్ ఛాయస్ నామినేషన్స్ లో ఉత్తమ విదేశీ భాష సిరీస్ లో  అందించే అవార్డుకి నామినేట్ అయ్యింది. ఈ విషయాన్నీరాజ్ అండ్ డి కె  అధికారంగా చెప్పడంతో పాటుగా తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేసారు.ఈ అవార్డుల వేడుక జనవరి 12 న జరగనుంది.

ఇక ఈ సిరీస్ లో సమంత ఎంతో అనారోగ్యంతో ఉన్నా కూడా షూటింగ్ లో పాల్గొన్ని కష్టతరమైన యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొనడం జరిగింది. అలాంటిది ఇప్పుడు సిటాడెల్ క్రిటిక్ నామినేషన్ కి ఎంపిక కావడం పట్ల ఆమె అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.