English | Telugu

పుష్ప 2 పై తన బాధని వ్యక్తం చేస్తున్న దేవర భామ జాన్వీ 

దేవరతో(devara)తెలుగు సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన భామ జాన్వీ కపూర్(janhvi kapoor)తొలి సినిమాతోనే తల్లి శ్రీదేవి(sridevi)కి తగ్గ వారసురాలు అనిపించున్న జాన్వీ భారీగా అభిమానులని కూడా సంపాదించుకుందని చెప్పవచ్చు.ప్రస్తుతం రామ్ చరణ్(ram charan)బుచ్చిబాబు(buchibabu)కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో చేస్తుండగా కొన్ని రోజుల క్రితమే సదరు మూవీ షూటింగ్ కూడా  ప్రారంభమయ్యింది. 

అసలు విషయానికి వస్తే పుష్ప 2(pushpa 2)నార్త్ ఇండియాలో అత్యధిక థియేటర్స్ లో విడుదలవ్వడం వల్ల ఇంటర్ స్టెల్లార్(interstellar)అనే హాలీవుడ్ మూవీ రీ రిలీజ్ వాయిదా పడింది.నిజానికి ఈ మూవీ కోసం నార్త్ ఇండియాకి చెందిన చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తూ వస్తున్నారు.దీంతో ఆ మూవీ తాలూకు లవర్స్ నార్త్ ఇండియాలోని ఎక్కువ శాతం ఐమాక్స్ లని పుష్ప 2 కి కేటాయించి,ఇంటర్ స్టెల్లార్ కి అన్యాయం చేసారని, సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చెయ్యడంతో పాటుగా మిమ్స్ పేజీ కూడా ఏర్పాటు చెయ్యడం జరిగింది.

 

ఇక  జాన్వీ కపూర్ ఆ కామెంట్స్ కి రిప్లై ఇస్తు 'పుష్ప 2 కూడా సినిమానే కదా.మరి ఎందుకు మరో సినిమాతో పోలుస్తూ తక్కువ అంచనా చేస్తున్నారు.మన సినిమాలని చూసీ ఇప్పుడు హాలీవుడ్ సినీ పరిశ్రమే మెచ్చుకుంటుంది.కానీ మనం మాత్రం, మన చిత్రాలని తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటున్నాం.ఇలాంటివి చూస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుందనే కామెంట్స్ చేసింది.జాన్వీ తెలుగు సినిమాకి మద్దతుగా నిలబటం పట్ల తెలుగు సినిమా ప్రేక్షకులు ఆమెని ప్రశంసిస్తున్నారు. ఇక పుష్ప 2  తొలి రోజు రెండు వందల తొంబై నాలుగు కోట్ల రూపాయలని సాధించి, ఆ ఫిగర్ ని సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలిచింది. రెండో రోజు కూడా అదే హవాని కొనసాగిస్తు మొత్తం రెండు రోజులకి నాలుగు వందల కోట్ల రూపాయలని సాధించి తన సత్తా చాటుతుంది.