English | Telugu

అల్లు అర్జున్ వీడియో రిలీజ్..పాతిక లక్షలు,వైద్యం,కుటుంబ బాధ్యత నాదే 

 

పుష్ప 2 బెనిఫిట్ షో సంధర్భంగా హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేణుక అనే మహిళ మృతి చెందగా,ఆమె కుమారుడు శ్రీ తేజ ప్రస్తుతం హాస్పిటల్ లో క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు.      ఇక ఇప్పుడు ఈ విషయం మీద అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేసాడు.అందులో అయన మాట్లాడుతూ సంధ్య థియేటర్ కి మూవీ చూసేందుకు వెళ్లాను.సినిమా చూసి వచ్చిన తరువాత రేవతి అనే మహిళ చనిపోయిందని ఆమె, బాబుకి సీరియస్ అని తెలిసింది.ఈ సంఘటనతో నేను, సుకుమార్,  మా టీమ్ మొత్తం చాలా బాధ పడ్డాం.రేవతి గారి ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నాను.నేను ఏం చేసినా ఆ లోటును భర్తీ చెయ్యలేను.కానీ రేవతి కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయంలో  వాళ్ళతో  మేము ఉంటాము.ఇపుడు 25 లక్షలు వారి ఫ్యూచర్ కోసం ఇస్తున్నాను.కానీ ఈ ౨౫ లక్షలకి సంబంధం లేకుండా బాబు  మెడికల్ ఖర్చులు భరిస్తా.ఆ ఫ్యామిలీ భాద్యత మొత్తం  నాది.మేము సినిమా నిర్మించేది ప్రేక్షకులని అభిమానుల్ని సంతోష పరచడానికి.సినిమా చూసి  ఇంటికి సేఫ్ గా వెళ్లండని అల్లు అర్జున్ తన  వీడియోలో  పేర్కొన్నాడు.

ఇక  తెలంగాణ గవర్నమెంట్ రేవతి మరణంతో తెలంగాణాలో ఇక మీదట ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవని తేల్చి చెప్పింది.ఈ విషయాన్నీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారంగా వెల్లడి చేసారు.దీంతో రాబోయే భారీ సినిమాలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావితం చూపిస్తుందో చూడాలి.