English | Telugu
ఫస్ట్ డే కలెక్షన్స్‌లో చరిత్ర సృష్టించిన ‘పుష్ప2’.. అఫీషియల్ ఫిగర్స్ వచ్చేసాయి!
Updated : Dec 6, 2024
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పుష్పరాజ్ ఓ కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ హీరో సాధించని ఆ రికార్డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలోకి చేరింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో, 12,000 థియేటర్లలో రిలీజ్ అయిన ‘పుష్ప2’ మొదటి రోజు కలెక్షన్స్‌లో కొత్త రికార్డు సృష్టించింది. వరల్డ్‌వైడ్‌గా మొదటి రోజు రూ.294 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ‘పుష్ప2’ అవతరించింది. ఇది ఆల్‌టైమ్ రికార్ట్ అంటూ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ కలెక్షన్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఈ సినిమాకి గత నెల రోజులుగా ఎంత హైప్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కలెక్షన్ రికార్డులన్నింటినీ క్రాస్ చేయడమే లక్ష్యంగా పుష్పరాజ్ రంగంలోకి దిగాడు. మొదట ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డును క్రాస్ చేశాడు. అయితే ఇంతకుముందు ఉన్న రికార్డులు పుష్ప2 దరిదాపుల్లో కూడా లేకపోవడం అందర్నీ షాక్‌కి గురి చేస్తున్న అంశం. రూ.2000 కోట్ల టార్గెట్‌తో ‘పుష్ప2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ చూస్తుంటే వాళ్ళ టార్గెట్‌ను త్వరగానే రీచ్ అవుతారేమో అనిపిస్తోంది. అయితే సినిమాకి డివైడ్ టాక్ రావడం కొంత మైనస్‌గా అనిపించినా, కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ వీకెండ్‌లో ఈ సినిమా సునాయాసంగా రూ.500 కోట్ల మార్క్‌ని క్రాస్ చేస్తుందని కలెక్షన్ ట్రెండ్ చూస్తుంటే అర్థమవుతోంది.