English | Telugu
శ్రీశైలంలో నాగచైతన్య,శోభిత,నాగార్జున..కారణం ఇదేనా!
Updated : Dec 6, 2024
నవ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల(shobitha dhulipala)వివాహం ఈ నెల 4 న రాత్రి ఎనిమిది గంటల సమయంలో జరిగిన విషయం తెలిసిందే.అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వివాహ వేడుకలో చిరంజీవి దంపతులు, మహేష్ బాబు, రాజమౌళి, అల్లు అర్జున్,రామ్ చరణ్, రానా,వెంకటేష్ తో పాటు మరికొంత మంది సినీ,రాజకీయ,వ్యాపార వర్గానికి చెందిన వాళ్ళు హాజరయ్యి వధూవరులిద్దరని ఆశీర్వదించడం జరిగింది.
ఇక నాగచైతన్య, శోభిత దంపతులిద్దరు ఈ రోజు శ్రీశైలం(srisailam)లో కొలువుతీరి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఆ ఇద్దరి వెంట నాగార్జున కూడా ఉండటం,శోభిత, చైతన్య లకి దగ్గరుండి హారతి ఇప్పించడం, ఆ సమయంలో శోభిత జుట్టు హరతకి అడ్డుపడుతుంటే నాగార్జున ఆమె జుట్టుని పట్టుకోవడం లాంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ఇక ఆలయ అధికారులు కూడా నాగార్జున, చైతన్య,శోభితలకి స్వాగతం పలికి దగ్గరుండి మల్లికార్జునుడిని,భ్రమరాంబ అమ్మ వార్ల దర్శనం చేయించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలని అందించడం జరిగింది.ఇక శ్రీశైల క్షేత్రం దోష పరిహారానికి ఎంతో ప్రసిద్ధి.అందుకే చాలా మంది స్వామి, అమ్మవార్లని దర్శించుకొని తమ దోషాలని పోగొట్టమని కోరుకుంటారు.ఈ క్రమంలోనే చైతు, శోభిత స్వామిని దర్శించుకొని ఉంటారనే మాటలు వినిపిస్తున్నాయి.