English | Telugu

బట్టల్లేకుండా నిలబెట్టి చెక్ చేశారు...జైల్లో నా నంబర్ ఇదే...

తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన నటి కస్తూరి కొన్ని రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయాలన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "నన్ను జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చారు. అక్కడ బెడ్ లాంటివి ఏమీ ఉండవు కిందే పడుకోవాలి. నన్ను క్వారంటైన్ వార్డులో పెట్టారు. అక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక వారం అందులో ఉంచుతారు... తర్వాత ఆర్డర్స్ ని బట్టి రిమాండ్ ప్రిజన్ కి పంపిస్తారు. మొదటి రోజు జైలుకు వెళ్ళినప్పుడు నాకు పిచ్చిపట్టినట్టు అయ్యింది. కంప్లీట్ స్ట్రిప్ సెర్చ్ ఉంటుంది. అల్లు అర్జున్ కి కూడా ఇలాగే అయ్యుంటుంది నాకు తెలిసి. అసలు బట్టలు లేకుండా నిలబడాలి. ఆడవాళ్ళ ప్రతీ పార్టీ పట్టుకుని మరీ చెక్ చేస్తారు. ప్రైవేట్ పార్ట్శ్ లో ఏమన్నా దాచామా అని చెక్ చేయడానికి మూడు సార్లు గుంజీళ్లు తీయిస్తారు. అల్లు అర్జున్ విషయంలో బెయిల్ వచ్చి ఉంటుంది అనుకున్నా కానీ జైలుకు వెళ్లారు. ప్రిజనర్ రికార్డు ఉంటుంది ..ఫోటో తీసి ఉంటారు.

‘యూఐ’ మూవీ రివ్యూ

పురుషులందు పుణ్య పురుషులు వేరయా..’ అనే వ్యాకాన్ని రివర్స్‌ చేస్తే ‘సినిమాలందు ఉపేంద్ర సినిమాలు వేరయా’ అనుకునే పరిస్థితి మొదటి నుంచీ ఉంది. కన్నడలో రూపొందిన ‘ఓం’ చిత్రంతో ఉపేంద్రను తెలుగు ప్రేక్షకులు డైరెక్టర్‌గా గుర్తించారు. కన్నడలో శివరాజ్‌కుమార్‌తో రూపొందించి హిట్‌ కొట్టిన ఉపేంద్ర తెలుగులో రాజశేఖర్‌ హీరోగా ‘ఓంకారం’ పేరుతో తెరకెక్కించారు. అప్పటివరకు వచ్చిన సినిమాల తీరు వేరు, ఉపేంద్ర చేసిన ఈ సినిమా వేరు అన్నట్టుగా ఫీల్‌ అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఆ సినిమాతో ఉపేంద్రకు ప్రత్యేక అభిమానగణం మొదలైంది. ఆ తర్వాత అతని డైరెక్షన్‌లోనే కన్నడలో రూపొందిన ‘ఎ’, ‘ఉపేంద’ వంటి సినిమాలు చూసి జనం పిచ్చెక్కిపోయారు.

తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి... ప్రభుదేవాతో...శేఖర్ మాష్టర్

శేఖర్ మాష్టర్ ఏ స్టెప్ వేసినా టాప్ స్టార్స్ తో వేయించినా అది సూపర్ డూపర్ హిట్ ఐపోతుంది. అంత టాలెంట్ ఉన్న కొరియోగ్రాఫర్ ఆయన. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా పని చేశారు. శేఖర్ మాస్టర్ డాన్స్ మూమెంట్స్ కి మంచి క్రేజ్ కూడా ఉంది. అతనివి చాలా హుక్ స్టెప్స్ పాపులర్ అయ్యాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేశారు. సినిమాలతో పాటు పలు టీవీ షోలకు కూడా హాజరవుతున్నారు. ఢీ షోకి జడ్జ్ గా ఆయన పని చేసాడు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అలాంటి శేఖర్ మాష్టర్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పిక్ పెట్టారు.