English | Telugu

విడుదల పార్ట్ 2 వాళ్ళని ఉద్దేశించి తీసిందే

మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి(vijay sethupathi)వెట్రిమారన్(vetri maaran)కాంబినేషన్ లో తెరకెక్కిన విడుదల పార్ట్ 2(viduthalai part 2)ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.2023 లో వచ్చిన విడుదల పార్ట్ 1 కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.

 ఈ మూవీలో విజయ్ సేతుపతి అభ్యుదయ భావాలు కల్గిన 'పెరుమాళ్' అనే ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ పోషించాడు.అణగారిన వర్గాలపై కొంత మంది పెత్తందార్లు ఎన్నో ఇబ్బందులకి గురి చేస్తు అత్యంత జుగుప్సాకరంగా కూడా చూస్తుంటారు.దీంతో వారి పక్షాన నిలబడి వాళ్ళకి సరైన న్యాయం జరగడానికి విజయ్ సేతుపతి చేసిన పోరాటం, తపన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.ఉద్యమకారులు ఎలా పుట్టుకొస్తారు.ఆ తర్వాత చర్చల పేరుతో కొంత మంది పోలీసులు వాళ్ళని ఎలా వదిస్తున్నారో కూడా చాలా క్లియర్ గా చూపించారు.

విజయ్ సేతుపతి సరసన మంజు వారియర్ జత కట్టగా సూరి,గౌతమ్ వాసుదేవమీనన్,అనురాగ్ కశ్యప్, కిషోర్,ఇళవరసు,రాజీవ్ మీనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో పోషించగా ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఆర్ఎస్ ఇన్ఫోటైన్మేంట్,శ్రీ వేదాక్షర మూవీస్ కుమార్,రామారావులు నిర్మించారు.