English | Telugu
బట్టల్లేకుండా నిలబెట్టి చెక్ చేశారు...జైల్లో నా నంబర్ ఇదే...
Updated : Dec 21, 2024
తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన నటి కస్తూరి కొన్ని రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయాలన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "నన్ను జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చారు. అక్కడ బెడ్ లాంటివి ఏమీ ఉండవు కిందే పడుకోవాలి. నన్ను క్వారంటైన్ వార్డులో పెట్టారు. అక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక వారం అందులో ఉంచుతారు... తర్వాత ఆర్డర్స్ ని బట్టి రిమాండ్ ప్రిజన్ కి పంపిస్తారు. మొదటి రోజు జైలుకు వెళ్ళినప్పుడు నాకు పిచ్చిపట్టినట్టు అయ్యింది. కంప్లీట్ స్ట్రిప్ సెర్చ్ ఉంటుంది. అల్లు అర్జున్ కి కూడా ఇలాగే అయ్యుంటుంది నాకు తెలిసి. అసలు బట్టలు లేకుండా నిలబడాలి. ఆడవాళ్ళ ప్రతీ పార్టీ పట్టుకుని మరీ చెక్ చేస్తారు. ప్రైవేట్ పార్ట్శ్ లో ఏమన్నా దాచామా అని చెక్ చేయడానికి మూడు సార్లు గుంజీళ్లు తీయిస్తారు. అల్లు అర్జున్ విషయంలో బెయిల్ వచ్చి ఉంటుంది అనుకున్నా కానీ జైలుకు వెళ్లారు. ప్రిజనర్ రికార్డు ఉంటుంది ..ఫోటో తీసి ఉంటారు.
నంబర్ ఇచ్చి ఉంటారు అనుకున్నా. నాకు ఇవన్నీ చేశారు. 644788798 నంబర్ ని నాకు ఇచ్చారు. సాయంత్రం 6 అయ్యేసరికి భోజనాలు పెట్టేసి జైలు డోర్స్ లాక్ చేసేస్తారు. అప్పుడు నాకు మెంటల్ గా నేను ఖైదీని అన్న ఫీలింగ్ వచ్చింది. మెంటల్ గా చాలా అప్సెట్ అయ్యాను. ఆ ఒక్కరోజు నిద్రపోలేదు. రెండు రోజుకు ధైర్యం వచ్చేసింది. బాగా తిని నిద్రపోయాను. జైల్లో చాలా మందిని కలిసాను. వాళ్ళ గాధల్ని విన్నాను. జైల్లో ద్రవిడియన్ పాలిటిక్స్ గురించి 4000 పేజీలు అక్కడ లైబ్రరీలో చదివాను. బాదం చెట్టు ఉంటే వాటిని దోనెలుగా చేసి అక్కడ ఉన్న వాళ్లందరికీ ఇచ్చాను. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. జైల్లో నాలుగు నెలల పసిబిడ్డ ఉన్నాడు వాళ్ళ అమ్మతో. జైల్లో నాకు మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇచ్చారు. అలాగే స్కూల్ ఉంటుంది. పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఆ స్కూల్ లో డిగ్రీ వరకు చదువుకోవచ్చు. జైలుకు వెళ్ళాక తెలిసింది ఏంటంటే నన్ను ఎలాంటి ప్లేస్ లో పెట్టినా నేను బ్రేవ్ గా ఉండగలను.. ఏది అవసరమో ఆ పని చేయగల సత్తా కూడా ఉందని అర్ధమయ్యింది. జైల్లో శిక్ష అనుభవించే వాళ్లంతా దోషులు కారు. దోషులందరికీ శిక్ష పడే ఛాన్స్ కూడా ఉండదు. ఇక్కడి ఈ మొత్తాన్ని కూడా ఒక బుక్ రాయాలి అనుకుంటున్నా" అని చెప్పుకొచ్చింది కస్తూరి.