యుఎస్ లోని ఇరవై తొమ్మిది ఏరియాల్లో డాకు మహారాజ్ సరికొత్త రికార్డు
తెలుగు చిత్ర సీమలో నందమూరి బాలకృష్ణ(balakrishna)కి ఉన్నచరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.తన ఐదు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన పోషించని పాత్ర లేదు.సృష్టించని రికార్డు లేదు.తెలుగు సినిమా ఏనాడో మర్చిపోయిన అర్ధ శతదినోత్సవం,శతదినోత్సవం,సిల్వర్ జూబ్లీలని నేటికి సాధిస్తూ అభిమానుల చేత,ప్రేక్షకుల చేత జై బాలయ్య అనిపించుకుంటున్నాడు.ఇప్పుడు ఇదే ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ, సంక్రాంతి కానుకగా జనవరి 12 న 'డాకు మహారాజ్'(daku maharaj)గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.