English | Telugu

 మా రిలేషన్ ని మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్లంతా యాక్సెప్ట్ చేశారు

సిక్స్త్ సెన్స్ సీజన్ 6 ఈ వారం ట్రెండింగ్ కపుల్ ని తీసుకొచ్చాడు. వాళ్లే "మళ్ళీ పెళ్లి" మూవీ హీరోహీరోయిన్స్ నరేష్, పవిత్ర. ఇందులో నరేష్ ని కొన్ని ఇంటరెస్టింగ్ క్వశ్చన్స్ అడిగాడు ఓంకార్. "మీ రిలేషన్ ఎలా స్టార్ట్ అయ్యింది" అని అడిగాడు.  "12 ఏళ్ళ కింద ఆలయం అనే మూవీలో కలిసి నటించాం. కానీ ఒకళ్ళతో ఒకళ్ళం అస్సలు మాట్లాడుకోలేదు. ఒకసారి ఎంఎస్ రాజుగారు హ్యాపీ వెడ్డింగ్ ఫిలింకి నన్ను బుక్ చేశారు. అప్పుడు నా పక్కన ఎవరు అని అడిగాను..పవిత్ర లోకేష్ అని చెప్పారు  ఆమేనా అనుకున్నా..ఎందుకంటే ఆమె ఎప్పుడు బుక్ చదువుకుంటూ తన లోకంలో తాను ఉంటుంది అనుకున్నా. మా ఇద్దరితో కలిపి ఫస్ట్ షూట్ జరిగింది. ఇద్దరం ఒకరికి ఒకరం విష్ చేసుకున్నాం.

బికినీలో హరితేజ.. అవాక్కైన నెటిజన్లు! 

హరితేజ.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్. హరితేజ యాంకర్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని ఇప్పుడు మంచి ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది. అయితే  హరితేజ తన గత ఏడాది ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం హరితేజ తన కూతురు భూమితల్లిని చూసుకుంటూ సమయం గడుపుతుంది. తనకి సంభందించిన విషయాలన్నింటిని హరితేజ ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంది. అయితే హరితేజ ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తాజాగా తను పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మరాయి.

మోకాళ్ళ మీద కూర్చొని కృష్ణకి ప్రపోజ్ చేసిన మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -161లో.. కృష్ణకి ప్రపోజ్ చెయ్యమని మధు అంటాడు. మీ స్వీట్ కపుల్ ని వీడియో తీసి పెడితే బోలెడు వ్యూస్ వస్తాయి. మురారి నువ్వు ప్రపోజ్ చెయ్ అనగానే రోజ్ ఫ్లవర్ తో మోకాళ్ళ పై కూర్చొని కృష్ణకి ప్రపోజ్ చేస్తాడు మురారి. మురారి ఇన్ని రోజులు కృష్ణపై దాచుకున్న ప్రేమని మొత్తం చెప్తాడు. ఐ లవ్ యూ కృష్ణ అని మురారి అనగానే.. లవ్ యూ టూ అని కృష్ణ చెప్తుంది. అదంతా చూస్తున్న ముకుంద..  మురారి అలా ప్రపోజ్ చెయ్యడం చూడలేక బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మధు బాగా ప్రపోజ్ చేసావని చెప్తాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాడు మధు. 

గుప్పెడంత మనసులో సరికొత్త ట్విస్ట్.. శైలేంద్ర ప్రపోజల్ ని రిజెక్ట్ చేసిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -767 లో.. వసుధార ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటుంది. అప్పుడే రిషి వచ్చి.. దేని గురించి ఆలోచిస్తున్నావు.. నీ మూడ్ బాలేదని నాకు తెలుసు అని రిషి అంటాడు. మీ మేడం నిన్ను అలా అనేసరికి నాకు బాగా అనిపించలేదు.. అందుకే అలా అన్నానని రిషి అంటాడు. మేడం మన గురించి, మన క్షేమం గురించి అలా అంటుందని వసుధార అంటుంది. అయిన మనకు ఏం అవుద్ది కొంచెం ఎక్కువగా ఆలోచించడం మానెయమని చెప్పు మీ మేడంకి వసుధార అని రిషి చెప్తాడు. మరి మేడం ఏమైనా బాధపడిందా అని రిషి అడుగగా.. సర్ నేను అదే అడిగాను. నాపై రిషి కోప్పడ్డ సరే రిషి బాగుండాలని మేడం అంది. మీరంటే మేడంకి ప్రాణమని వసుధార అనగానే.. రిషి డల్ అయిపోయి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఏంటి నువ్వు గుడ్ నైట్ చెప్పవా అని రిషి అడుగుతాడు. మీరు అప్సెట్ లో ఉన్నారా మిమ్మల్ని అలా వదిలేస్తే రిషిధారని ఎలా అవుతాను.. మిమ్మల్ని హ్యాపీ చేసి హ్యాపీ నైట్ చెప్తానని వసుధార అంటుంది.