Read more!

English | Telugu

శైలేంద్ర విలనిజంతో ఆసక్తికరంగా సాగుతున్న గుప్పెడంత మనసు సీరియల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-768 లో.. మిషన్ ఎడ్యుకేషన్ విస్తరణలో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం ఇష్టంలేని రిషి, తన గదిలోకి వచ్చి బాధపడుతుంటాడు. అంతలో వసుధార వచ్చి.. మీరు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను సర్ .. మీరు నా ప్రాణం సర్ అని వసుధార అనగా.. మరి నా ప్రాణమైన DBSTకాలేజీని వదిలి ఎలా వెళ్తాననుకున్నావ్. అయినా మంచి చేయాలనుకున్న వాళ్ళకి శత్రువులు కొంచెం ఎక్కువగా ఉంటారని వసుధారతో రిషి అంటాడు. సరే సర్ మీ ఇష్టమని వసుధార అంటుంది. నాక్కొంచెం కాలేజీలో పని ఉందని రిషి వెళ్తాడు. 

ఆ తర్వాత కాలేజీలో ఫణీంద్ర, జగతి, వసుధార, రిషి కలిసి కట్టబోయే మెడికల్ కాలేజీకి టెండర్ వేయడానికి ఈ సిటీలో బెస్ట్ బిల్డర్స్ ని లిస్ట్ అవుట్ చేసి కోట్ చేసి పంపించండని రిషి వసుధారతో చెప్తాడు. అప్పుడే శైలేంద్ర వచ్చి.. ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు. అదే అన్నయ్య బిల్డింగ్ కాంట్రాక్టర్స్ గురించి మాట్లాడుతున్నామని రిషి అంటాడు. నాకు తెలిసిన బిల్డర్ ఉన్నాడు కదా.. ఆ విషయం నీకు చెప్పాను కదా అని శైలేంద్ర అంటాడు‌. అవును కదా మర్చిపోయాను అన్నయ్య అని రిషి అంటాడు. ఆ తర్వాత శైలేంద్ర ఆ బిల్డర్ వచ్చాడని చెప్పి అతడిని పిలిపిస్తాడు. తను సారథి.. ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ ఇన్ ఛార్జ్ అని రిషికి శైలేంద్ర పరిచయం చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు చాలా పెద్ద పెద్ద కంట్రాక్టర్స్ చేసారని శైలేంద్ర అంటాడు. మీరు అంత పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ చేసినవాళ్ళు ఒక మెడికల్ కాలేజ్ ని కాంట్రాక్టర్ గా ఎందుకు చేద్దామనుకుంటున్నారని జగతి అడుగగా.‌ మీ గురించి టీవీల్లో, పేపర్లో  చూసాను‌.. DBST కాలేజీ భవిష్యత్తులో ఇంకా విజయాలు సాధిస్తుంది. ఆ కాలేజీ కట్టింది మేమైతే మాకొక ఆత్మసంతృప్తి ఉంటుందని సారథి అంటాడు. మరి మీరు ఇంతకముందు చేసిన ప్రాజెక్టు ఫైల్స్ ఇవ్వండని వసుధార అంటుంది. సారీ తీసుకురాలేదని సారథి అంటాడు. మరి ల్యాప్‌టాప్ లో గానీ ఫోన్ లో కానీ కోటేషన్స్ ఉన్నాయా అని వసుధార అడుగగా.. అవేమీ లేవండి శైలేంద్ర గారు పిలవగానే కంగారుగా వచ్చానని సారథి తడబడతాడు. దాంతో పక్కనే ఉన్న శైలేంద్ర.. మేమిద్దరం చాలా ప్రాజెక్ట్స్ చేసాం.. అతను మనకి నమ్మకస్తుడని కవర్ చేస్తాడు. పిన్నికి, వసుధారకి నమ్మకం లేనప్పుడు ఎందుకులే రిషి అని శైలేంద్ర అంటాడు. దాంతో నాకు నమ్మకం ఉందని చెప్పి కాంట్రాక్టు మీద సైన్ చేపించుకుంటాడు రిషి. మరి అమౌంట్ పంపిస్తే వర్క్ స్టార్ట్ చేస్తానని సారథి చెప్పగా..‌ అవునా సరే.‌. మీ అకౌంట్ డీటెయిల్స్ చూసి పంపిస్తానని రిషి చెప్తాడు. దాంతో సరేనని చెప్పి సారథి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత మనం రిషికి నిజం చెప్పేద్దామని జగతితో వసుధార అంటుంది. లేదంటే శైలేంద్ర ఎంతకైనా తెగిస్తాడని చెప్పి రిషి దగ్గరికి నిజం చెప్పడానికి వెళ్తుండగా .. కాలేజీ పైనున్న పూలకుండి రిషి మీద పడిపోతుండగా అది చూసిన వసుధార.. తనని పక్కకి లాగేస్తుంది. దాంతో రిషి తప్పించుకుంటాడు. అందరూ కంగారుపడతారు. దాంతో వెంటనే అక్కడకి వచ్చిన శైలేంద్ర.. నీకేం కాలేదు కదా రిషి.. ఈ రోజు నువ్వు లేచిన గడియ మంచిదైంది.‌ పిన్ని మొహమే చూసి ఉంటావని అంటాడు. ఆ తర్వాత రిషిని లోపలికి తీసుకెళ్ళమని చెప్తాడు శైలేంద్ర. ఆ తర్వాత జగతి, శైలేంద్ర ఇద్దరే ఉంటారు. ఈ సారి కొంచెంలో మిస్ అయింది. ఇంకోసారి అలా జరగదు.. రిషి ప్రాణాలా? లేక కాలేజా? తేల్చుకో పిన్ని అని శైలేంద్ర అంటాడు. రిషి నాకన్నా ఎదిగాడు.. ఎలాగైనా ఈ DBST కాలేజీకి ఎండిని అవుతాను.. అది మా అమ్మ కల అని  శైలేంద్ర అంటాడు. దాంతో జగతి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.