Read more!

English | Telugu

దేవి మూవీ టైంలో కంపోజ్ చేసిన మ్యూజిక్ నాగ్ మూవీలో...సీక్రెట్ రివీల్ చేసిన దేవి

ఆహా ఓటిటి వేదిక తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2  ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తోంది. ఈవారం షోకి దేవి శ్రీప్రసాద్ జడ్జిగా వచ్చాడు. కంటెస్టెంట్స్ అంతా ఆయన మూవీస్ లో సాంగ్స్ పాడారు. ఐతే కంటెస్టెంట్ జయరాం "నేను నేనుగా లేనే" అనే సాంగ్ పాడేసరికి జడ్జెస్ అంతా ఫిదా ఇపోయారు. అప్పుడు ఈ సాంగ్ కి సంబంధించి ఎప్పుడూ రివీల్ చేయని ఒక సీక్రెట్ ని ఈ స్టేజి మీద చెప్పారు డిఎస్పి. తన 16 ఏళ్ళ వయసులో మ్యూజిక్ కంపోజర్ గా మారినప్పుడు తన ఫస్ట్ మూవీ  "దేవి" కి సాంగ్ కంపోజ్ చేయాల్సి వచ్చిందట.

ఐతే అందులో ఉన్న ఒక సిట్యుయేషన్ కి ఒక మంచి మెలోడీ పెడదామనుకుని ఒక ట్యూన్ కంపోజ్ చేసుకున్నా. అదే "నేను నేనుగా లేనే" అనే ట్యూన్. ఆ తర్వాత దేవి మూవీలో ఈ సాంగ్ పెట్టడానికి సరైన సిట్యుయేషన్ రాకపోయేసరికి తాను చాలా బాధపడ్డాడట అప్పుడు. ఆ సాంగ్ పల్లవి అలాగే తన దగ్గర ఉండిపోయిందని చెప్పాడు. ఎప్పుడైతే తాను నాగార్జున గారి మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశం వచ్చింది.  ఈ సాంగ్ కి తగ్గ సిట్యుయేషన్ "మన్మధుడు" మూవీలో క్రియేట్ చేశారు డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు.. అప్పుడు ఈ సాంగ్ అక్కడ సరిగా ఫిట్ అవుతుందని చెప్పి ఆ మూవీలో ఈ బ్యూటిఫుల్ మ్యూజిక్ యాడ్ చేసాం...ఈ మ్యూజిక్ కి సీతారామ శాస్త్రీ గారు మంచి లిరిక్స్ అందించారు. అలాగే మరో కంటెస్టెంట్ అయ్యన్ ప్రణతి పాడిన "సూపర్ మచ్చి" సాంగ్ గురించి కూడా చెప్పాడు దేవి.

ఆ సాంగ్ లిరిక్స్ మొత్తాన్ని త్రివిక్రమ్ తన చేతే రాయించారట. ఈ సాంగ్ విన్నాక సీతారామ శాస్త్రీ గారు ఫోన్ చేసి చాలా ఏళ్ళ నుంచి ఈ మాస్ సాంగ్స్ కి దూరంగా ఉన్న తన చేత మళ్ళీ ఒక మాస్ సాంగో, ఐటెం సాంగో రాయాలనే కోరిక పుట్టించావు, చాలా బాగా రాసావ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్, దేవిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి హిట్స్ అందించాడు. తెలుగు మూవీ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ అందరికీ మ్యూజిక్ అందించాడు దేవిశ్రీప్రసాద్. ఇక పుష్ప మూవీ మ్యూజిక్ మేనియా దేశవిదేశాల్లోనూ మారు మోగింది. ఐటమ్స్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా దేవిని చెప్పొచ్చు.‘రింగ రింగ’, " ఆ అంటే అమలాపురం", "కెవ్వుకేక", "డియ్యాలో డియ్యాలో" వంటి సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగే..ఈ సాంగ్స్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.