Read more!

English | Telugu

నా వంట కంటే హాస్టల్ ఫుడ్డే  బాగుంటుందన్న దీప్తి సునైన!

దీప్తి సునైన.. సోషల్ మీడియాలో ఫేమస్ సెలబ్రిటీ. దీప్తి సునైన అని పేరు వినగానే షణ్ముఖ్ కూడా గుర్తుకొస్తాడు.. అంతలా వీరిద్దరి మధ్య లవ్ బాండింగ్ ఉండేది. వీళ్ళిద్దరి పేర్లతో ఇన్ స్టాగ్రామ్ లో చాలా ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి.

దీప్తి సునైన, షణ్ముఖ్ జస్వంత్ మధ్య లవ్ బ్రేకప్ అయి‌ సంగతి అందరికీ తెలిసిందే.. దీనికి కారణం షణ్ముఖ్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సిరి హనుమంత్ తో క్లోజ్ గా ఉండటమే కారణమంటూ అప్పట్లో పలు కామెంట్లు కూడా వచ్చాయి. షణ్ముఖ్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనకి బాగా సపోర్ట్ చేసిన దీప్తి సునైన.. తను బయటకొచ్చాక ఇలా దూరం అవ్వడం బాగోలేదని పలువురు అభిమానులు వాళ్ళకి చెప్పారు. అయితే దీప్తి సునైన, షణ్ముఖ్ జస్వంత్ మధ్య కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. నిన్న మొన్నటిదాకా తను ఒంటరిగా ఉంటున్నాని చెప్పిన దీప్తి.. ఇప్పుడు తాజాగా కుకింగ్ వీడియోలు చేస్తుంది. అయితే అలా చేసిన వంటని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది దీప్తి సునైన.

అయితే దీప్తి సునైన నిన్న మొన్నటి దాకా రీల్స్ చేస్తు ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు తాజాగా సమాజ సేవ చేయడానికి ముందుకొచ్చింది. అయితే ప్రతీ శుక్రవారం తనకి ఇన స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినవారిలో కొంతమందిని సెలెక్ట్ చేస్తుందంట. అలా సెలెక్ట్ చేసిన వారి అడ్రెస్ లు తీసుకొని తను వంట చేసిన ఫుడ్ ని పంపిస్తుందంట దీప్తి సునైన. అయితే నిన్న చాలామంది అభిమానులు తన ఇన్ బాక్స్ కి మెసేజ్ చేసారంట.. కొంతమందైతే.. 'మేము హాస్టల్ లో ఉంటున్నాం అక్కా.. అసలు ఫుడ్ బాగోట్లేదు ప్లీజ్ మాకు పంపించండి' అని రిక్వెస్ట్ చేసారంట.. ఆ మెసేజ్ కి దీప్తి సునైన తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో రిప్లై ఇచ్చింది. మీరు హాస్టల్ ఫుడ్ బాగోలేదని అంటున్నారు.

నేను వంట చేసి పంపించాక.‌. ఆ ఫుడ్ మీరు తింటే.‌‌. నా వంట కన్నా హాస్టల్ ఫుడ్డే బాగుంటుందని అంటారేమో అని చెప్పింది. అయితే దీంతో పాటుగా ఇన్ స్టాగ్రామ్ మరో వీడియో షేర్ చేసింది దీప్తి సునైన.. నేను పదిహేను మందికి వంట చేసి పంపిద్దామనుకున్నాను.. చాలా మంది అడ్రెస్లు పంపించారు.. అందులో నుండి పద్దెనిమిది మందిని సెలెక్ట్ చేసాను. వారికి ఫుడ్ వండి పంపిస్తాను. కానీ నేనెప్పుడు అంతమందికి వండలేదు.  ఒక నాలుగు అయిదుసార్లు వండాలేమో.. చూద్దాం ఏమవుతుందోనని దీప్తి సునైన చెప్పింది. దీంతో తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ మంచి పని చేస్తున్నారంటున్నారు. అయితే దీప్తి సునైన చేస్తోన్న  ఈ మంచి పని ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి!