Read more!

English | Telugu

పవన్ కళ్యాణ్ కళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంది.. అందుకే ఆయనంటే పిచ్చి!

యాంకర్ వీజె జయతి.‌. ఒకప్పుడు జెమిని మ్యూజిక్ లో మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అయితే తను టెలివిజన్ రంగానికి కొన్ని సంవత్సరాలుగా దూరమైంది. అలా తను దూరం కావడానికి మళ్ళీ బ్యాక్ రావడానికి తన వ్యక్తిగత జీవితం ఎలా ఉందో.. తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది. 

మీరు టెలివిజన్ రంగం నుండి దూరంగా ఇన్ని సంవత్సరాలు ఉండటానికి గల కారణమేంటని జయతిని ప్రశ్నించగా.. "నేను జెమినీ మ్యూజిక్ లో వెన్నెల ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు.. ఇంకా ఎప్పుడు ఇవేనా.. సినిమాలలోకి వెళ్దామని అనిపించింది.. అయితే సినిమాలలోకి వెళ్ళి అక్కడ సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ వెనక్కి రావాలంటే ఏదోలా ఉంటుంది కదా.. అయితే కొన్ని రోజులు గ్యాప్ ఇద్దామని మానేసా" అని జయతి చెప్పింది.

మరి అలా గ్యాప్ వచ్చింది కదా ఏం చేసారని ప్రశ్నించగా.. " నేను ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్నాను.. ఆ తర్వాత కరోనా వచ్చింది.. ఆ తర్వాత ఒక సినిమా తీసాను. ప్రొడ్యూసర్ గా చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను.. అయితే నేను ప్రొడ్యూసర్ గా చేసి వేరే ఎవరినో హీరోయిన్ గా తీసుకోవడమెందకని నేనే హీరోయిన్ గా చేశాను.. ఆ సినిమాకి మూడు కోట్లు ఖర్చయింది. ఆ సినిమా రిలీజ్ రోజు దాదాపు పదికి పైగా సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. ఇక అప్పుడు రిలీజ్ చేయకుంటే మళ్ళీ ఆ సినిమా ఆగిపోతుందేమోనని రిలీజ్ చేశాం .. కానీ అది పుష్కలలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయిందని చెప్పింది జయతి.

ప్రొడ్యూసర్ గా చేసారు కదా మరి ఇబ్బందులేం రాలేదా అని ప్రశ్నించగా.. నాకు పెద్దగా ఇబ్బందులేం రాలేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా ఉంది. నాతో వచ్చినవాళ్ళు కొందరు యాంకరింగ్ లో ఉన్నారు. మరికొందరు డైరెక్షన్ వైపు వెళ్ళారు. మరికొందరు టీవిరంగంలో ఉన్నారు. నాకు మాత్రం గ్యాప్ వచ్చింది. అందుకే ఆ గ్యాప్ కవర్ చేయడానికి ఇక తగ్గేదేలే లేదు..  సినిమాలలో చేస్తాను. ఏ అవకాశం వచ్చినా వదులుకోను.. అయితే ఇక్కడ ట్యాలెంట్ ఉన్నా కూడా తెలుగు అమ్మాయిలకి అవకాశం ఇవ్వరని జయతి చెప్పింది.

మీకు ఏ హీరో అంటే ఇష్టమని అడుగగా.. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం.. ఆయన కళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంది. అప్పుట్లో పవన్ కళ్యాణ్ అంటే మస్త్ క్రేజ్ ఉండేది.‌ ఆయన తర్వాత రజనీకాంత్ అంటే ఇష్టం. హీరోయిన్ లలో సిమ్రాన్ అంటే ఇష్టం.. ఓల్డెన్ డేస్ లో ఉన్న హీరోలలో కృష్ణ గారు అంటే అభిమానం.. ఆయన అన్ని సినిమాలు చూసేదాన్ని.. ఆ తర్వాత వాణిశ్రీ గారంటే పిచ్చి.. ఆమె సినిమాలు చూడటం కోసం చెవికోసుకునేదాన్ని. వాణిశ్రీ గారికి అంత అభిమానిని అని చెప్పుకొచ్చింది జయతి. అయితే తను స్వంతంగా ఒక ప్రొడక్షన్ హౌజ్ పెట్టి.. సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని చూస్తుందంట. ఇలా తన కెరీర్ గురించి వ్యక్తిగత జీవితం గురించి తెలుగువన్ తో షేర్ చేసుకుంది జయతి.