English | Telugu

బిగ్‌బాస్‌పై ర‌వి సంచ‌ల‌న కామెంట్స్‌!

బిగఃబాస్ సీజ‌న్ 5 టైటిల్ ఫేవ‌రేట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యాంక‌ర్ ర‌వి అనూహ్యంగా 12వ వారంలోనే ఇంటి నుంచి బ‌య‌టికి రావ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేసింది. అత‌ని ఎలిమినేష‌న్ అన్ ఫేర్ అని.. అత‌న్ని కావాల‌నే ఎలిమినేట్ చేశార‌ని ర‌వి ష్యాన్స్ ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా సోష‌ల్ మీడియా వేదిక‌గా బిగ్‌బాస్ నిర్వ‌హ‌కుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలా వుంటే హౌస్ నుంచి అర్థాంత‌రంగా బ‌య‌టికి వ‌చ్చిన యాంక‌ర్ ర‌వి బిగ్‌బాస్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది...

`కార్తీక దీపం`: దీప‌ని త‌ప్పించే ప్లాన్ చేసిన మోనిత‌

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ధారావాహిక `కార్తీక దీపం`. నేడు 1210వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు ఈ రోజు ఎపిసోడ్‌లో చోటు చేసుకోనున్నాయి. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. హిమ‌, శౌర్య ఇద్ద‌రూ కార్తీక్‌, దీప ఆనందంగా వుండ‌టం చూసి ఎప్పుడూ ఇలాగే న‌వ్వుతూ వుండాల‌ని కోరుకుంటారు. అదే స‌మ‌యంలో శౌర్య `హిమా.. నీకో గుడ్ న్యూస్ ..మ‌నం త్వ‌ర‌లో బ‌స్తీలో ఇల్లు క‌ట్టుకోబోతున్నాం.. అమ్మా నాన్నా.. ఇద్ద‌రూ సైట్ చూడ‌టానికి బ‌స్తీకి వెళుతున్నారు తెలుసా` అంటుంది.