English | Telugu

'చిన్నారి పెళ్లికూతురు 2'లో స‌రికొత్త‌ ఆనంది ఈమే!

ప్ర‌స్తుతం టీవీ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న బిగ్గెస్ట్ నేమ్స్‌లో శివంగి జోషి ఒక‌టి. ఇటీవ‌లే ఆమె పాపుల‌ర్ టీవీ షో 'బాలికా వ‌ధు 2' (చిన్నారి పెళ్లికూతురు 2)లో పెరిగి పెద్ద‌దైన ఆనంది పాత్ర‌లోకి అడుగుపెట్టింది. అంత‌కు ముందు ఆమె 'యే రిష్తా క్యా కెహ్‌లాతా హై' సీరియ‌ల్‌లో సీర‌త్/ నైరా పాత్ర‌లో క‌నిపించింది. ఆరేళ్ల‌పాటు అందులో హీరోయిన్‌గా న‌టించాక‌, దాన్నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది శివంగి. ఆమె ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఎనిమిదేళ్లు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ త‌ర్వాత లీడ్ రోల్స్ చేస్తూ వ‌స్తోంది. ఇంత‌కాలం ఆమె ఇండ‌స్ట్రీలో ఉండ‌టంతో ఆమె ఏజ్ 26 లేదా 27 ఏళ్లు ఉంటుంద‌ని జ‌నాలు అనుకుంటున్నారు. కానీ ఆమె వ‌య‌సు అంత కాదు.

Also read:రోజాకు అడ్డంగా దొరికి పోయిన జ‌బ‌ర్ద‌స్త్ జోడీ!

ఇటీవ‌ల ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో వికీపీడియాలో త‌న వ‌య‌సు 26 లేదా 27 ఏళ్లు ఉంటుంద‌ని వెల్ల‌డించ‌డం క‌రెక్ట్ కాద‌ని చెప్పింది శివంగి. దాన్ని స‌రిచేయ‌డానికి ప‌లుసార్లు ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేద‌ని ఆమె వెల్ల‌డించింది. "అయితే ఏదో ఒక‌రోజు ఆ వ‌య‌సుకు వ‌స్తాను. ఈలోగా నేను సాధించాల్సింది చాలా ఉంది. కానీ ఇప్పుడు నా వ‌య‌సు 23 సంవ‌త్స‌రాలే" అని ఆమె వెల్ల‌డించింది.

Also read:బిగ్‌బాస్‌పై ర‌వి సంచ‌ల‌న కామెంట్స్‌!

సో.. ఇప్పుడు జ‌నాల‌కు శివంగి అస‌లు వ‌య‌సెంతో తెలిసిపోయింది. అంటే మ‌నం ఊహించిన‌దాని కంటే ఆమె చాలా చిన్న‌ద‌న్న మాట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, 'బాలికా వ‌ధు 2'లో ఆమె 17 ఏళ్ల ఆనంది పాత్ర‌ను పోషిస్తోంది. ఆనంది పాత్ర గ‌తంలో తాను పోషించిన పాత్ర‌ల కంటే చాలా భిన్నంగా ఉంటుంద‌నీ, ఆనందికీ త‌న‌కూ మ‌ధ్య చాలా పోలిక‌లున్నాయ‌నీ శివంగి చెప్పింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.