మాళవిక - అభిమన్యులకు షాకిచ్చిన యష్ - వేద
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. నిరంజన్‌చ డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, మిన్ను నైనిక,ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని ఈ సీరియల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మాళవిక కుట్రని తెలుసుకోని వేద తను చెప్పిన మాటలు వినిపి యష్ తో పెళ్లికి నిరాకరిస్తుంది. కూతురు మాత్రమే ఉందని, కొడుకు లేడని తనని నమ్మించి మోసం చేశారంటూ యష్ కుటుంబంపై మండిపడుతుంది.