రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో నాగచైతన్య! జానర్ ఏంటో తెలుసా?
'శ్యామ్ సింగ రాయ్' సినిమా వచ్చాక అందరి దృష్టీ దాని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ మీదకు మళ్లింది. టైటిల్ రోల్లో నానిని, దేవదాసి క్యారెక్టర్లో సాయిపల్లివిని అతను చూపించిన విధానం, మొత్తం మూవీని అతను రూపొందించిన తీరు ఇటు విమర్శకుల్నీ, అటు ప్రేక్షకుల్నీ బాగా మెప్పించింది. నాని, సాయిపల్లవి కెరీర్లలో బెస్ట్ రోల్స్, బెస్ట్ పర్ఫెర్మెన్స్ ఇవే అనే ప్రశంసలు వచ్చాయి. ఆ క్రెడిట్ అంతా రాహుల్‌దేనని అంతా చెప్పుకుంటున్నారు.