English | Telugu

ర‌వితేజతో ఫారియా, ప్రియాంక రొమాన్స్!

ప్రీవియ‌స్ మూవీ `క్రాక్`లో స్టార్ బ్యూటీ శ్రుతి హాస‌న్ తో రొమాన్స్ చేసిన మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. రాబోయే చిత్రాల్లో మాత్రం బ‌డ్డింగ్ హీరోయిన్స్ తో జోడీ క‌డుతుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. `ఖిలాడి`లో మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి.. `రామారావు ఆన్ డ్యూటీ`లో దివ్యాంశ కౌశిక్‌, రాజీషా విజ‌య‌న్.. `ధ‌మాకా`లో శ్రీ‌లీల‌తో మాస్ మ‌హారాజా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నారు.

క‌ట్ చేస్తే.. ఆపై రాబోయే `రావ‌ణాసుర‌`లోనూ ఇదే శైలిని కొన‌సాగించ‌బోతున్నార‌ట‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. సుధీర్ వ‌ర్మ రూపొందించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో `జాతిరత్నాలు` ఫేమ్ ఫారియా అబ్దుల్లా, `గ్యాంగ్ లీడ‌ర్` బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహ‌న్ నాయిక‌లుగా న‌టించ‌బోతున్నార‌ని తెలిసింది. అదేగ‌నుక నిజమైతే.. ఆ ఇద్ద‌రితోనూ ర‌వితేజ న‌టించే మొద‌టి సినిమా ఇదే అవుతుంది. త్వ‌ర‌లోనే `రావ‌ణాసుర‌`లో ఫారియా, ప్రియాంక ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

Also read: చిన్న సినిమాకు 'పుష్ప' బ్యాన‌ర్‌ అండదండ‌లు!

కాగా, `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ`, `ధ‌మాకా`, `రావ‌ణాసుర‌` వ‌చ్చే ఏడాది థియేట‌ర్స్ లోకి రాబోతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 11న `ఖిలాడి` రిలీజ్ కానుండ‌గా.. మార్చి 25న `రామారావు ఆన్ డ్యూటీ` విడుద‌ల కానుంది. `ధ‌మాకా`, `రావ‌ణాసుర‌` 2022 ద్వితీయార్ధంలో తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది