English | Telugu

డైరెక్ట్ రిలీజ్ కోసం 'రాధేశ్యామ్‌'కు ఓటీటీ దిగ్గ‌జం రూ. 400 కోట్ల ఆఫ‌ర్‌?

చాలాకాలంగా ప్ర‌భాస్‌, పూజా హెగ్డే 'రాధేశ్యామ్' కోసం ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి 14న ఆ సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతోంది. కాగా, దేశంలో కొవిడ్ 19 కేసులు శ‌ర‌వేగంగా పెరుగుతుండ‌టంతో సినిమాల విడుద‌ల‌కు సందిగ్ధంలో ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే రాజ‌మౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. త‌మ సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డానికి 'రాధేశ్యామ్' ప్రొడ్యూస‌ర్స్ స‌న్నాహాలు చేస్తుండ‌గా, ఒక ఓటీటీ దిగ్గ‌జం వారికి రూ. 400 కోట్ల ఆఫ‌ర్‌తో సంప్ర‌దించిందంటూ ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

Also read:వంట‌ల‌క్క మ‌రిదిని బుట్ట‌లో వేసిన మోనిత‌

'ఆర్ఆర్ఆర్' విడుద‌ల వాయిదా ప‌డ‌టంతో, 'రాధేశ్యామ్' విడుద‌ల‌పై కూడా సందిగ్ధ‌త నెల‌కొంది. అయితే, వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జ‌న‌వ‌రి 14న తాము సినిమా విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ధ్రువీక‌రించారు. కానీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో థియేట‌ర్ల‌ను మూసేస్తుండ‌ట‌మో లేక‌, 50 శాతం ఆక్యుపెన్సీతో న‌డుపుతుండ‌ట‌మో జ‌రుగుతుండ‌టంతో 'రాధేశ్యామ్‌'ను ఓటీటీలో నేరుగా రిలీజ్ చేసే అవ‌కాశాలు ఉన్నాయంటూ వ‌దంతులు మొద‌ల‌య్యాయి. ఓటీటీ దిగ్గ‌జాలు భారీ ఆఫ‌ర్ల‌తో నిర్మాత‌ల‌ను సంప్ర‌దించాయి.

Also read:సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు!

ట్రేడ్ విశ్లేష‌కుడు మ‌నోబాల విజ‌య‌బాల‌న్ "ఒక ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డైరెక్ట్ రిలీజ్ కోసం 'రాధేశ్యామ్‌'కు రూ. 400 కోట్లు ఆఫ‌ర్ చేసింది." అని ట్వీట్ చేశాడు.

ఒక హ‌స్త‌సాముద్రికుడు, అంద‌మైన ఒక సంప‌న్న యువ‌తి మ‌ధ్య న‌డిచే ప్రేమ‌క‌థ 'రాధేశ్యామ్‌'. విధి వారితో ఎలా ఆడుకుంది, వారి ప్రేమ విధి ముందు త‌ల‌వంచిందా, త‌లెత్తుకుందా? అనేది ఇందులోని ప్ర‌ధానాంశం. 1970ల నాటి యూర‌ప్ నేప‌థ్యంలో న‌డిచే ఈ మూవీని రాధాకృష్ణ‌కుమార్ డైరెక్ట్ చేశాడు. యూవీ క్రియేష‌న్స్, గోపీకృష్ణా మూవీస్‌, టి-సిరీస్ ఈ మూవీని నిర్మించాయి.