English | Telugu

క్రేజీ కాంబో.. తారక్ సరసన రష్మిక!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రష్మిక ఇటీవల అల్లు అర్జున్ కి జోడీగా పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'లో శ్రీవల్లిగా నటించి మెప్పించింది. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీలో నటించే అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. 'జ‌నతా గ్యారేజ్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ #NTR30లో హీరోయిన్ గా రష్మిక ఫైనల్ అయిందని సమాచారం. అదే నిజమైతే తారక్, రష్మిక కలయికలో రాబోతున్న మొదటి సినిమా ఇదే కానుంది.

ఈ సినిమా ఉగాది సంద‌ర్భంగా సెట్స్ పైకి వెళుతుంద‌ని సమాచారం. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి సంవ‌త్స‌రాంతంలో లేదా 2023 సంక్రాంతి కానుక‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని విడుద‌ల చేసే అవ‌కాశ‌ముందంటున్నారు.