English | Telugu

Karthika Deepam2 : మనసు మార్చుకున్న శ్రీధర్.. జ్యోత్స్నకి ఇచ్చిపడేసిన దీప!

 స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -461 లో......కాశీ పోలీస్ స్టేషన్ లో స్వప్న ఉన్నాడని ఏడుస్తుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. ఎందుకు మమ్మల్ని ఇలా లోపల ఉంచి లాక్ వేసి వెళ్లారని శ్రీధర్ పై కావేరి కోప్పడుతుంది. ఆయనకు మనసు ఉంటేనే కదా మమ్మీ అని స్వప్న కూడా శ్రీధర్ ని తిడుతుంది. అప్పుడే కాశీ, దాస్ ఇంట్లో కి వస్తారు. కాశీని చూసి స్వప్న సంతోషపడుతూ నిన్ను మావయ్య బయటకు తీసుకోని వచ్చాడా.. చాలా థాంక్స్ మావయ్య మిమ్మల్ని చూసి కొంతమంది బుద్ది తెచ్చుకోవాలని స్వప్న అంటుంది.

సంజనకి బిగ్ బాస్ సపోర్ట్.. ఇమ్మాన్యుయల్ కి అన్యాయం చేసిన మనీష్!

బిగ్ బాస్ సీజన్-9 తెలుగు మొదలై నాలుగు రోజులు పూర్తయింది. ఈ సీజన్ లో నిన్నటి వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో అందరు సరదాగా మాట్లాడుకున్నారు. నామినేషన్ లో అందరు సంజనని టార్గెట్ చేసినట్టుగా అనిపించడంతో తను ఏడ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సంజనని కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు బిగ్ బాస్. మిమ్మల్ని అందరు కార్నర్ చేసినట్లు అనిపిస్తుందా అని అడుగుతాడు. అవును బిగ్ బాస్ చాలా బాధగా ఉంది. ఎవరు బాధపడిన నేను వెళ్లి వాళ్ళని ఓదారుస్తాను కానీ అందరు నన్ను కార్నర్ చేసారని సంజన చెప్తుంది. నిన్ను అందరు కార్నర్ చేసినా నువ్వు ధైర్యంగా ఉన్నావ్.. అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను అందుకే నీకు స్పెషల్ పవర్ ఇస్తున్నానని బిగ్ బాస్ చెప్పాడు.  

సెలబ్రిటీస్ కన్నా వీళ్ళే బిగ్ బాస్ లో ఉంటే బాగుండేదనిపిస్తోంది..

బిగ్ బాస్ అగ్నిపరీక్షను కామన్ మ్యాన్ ని హౌస్ లోకి పంపించడానికి ఏమంటా నిర్వహించారో కానీ ఈ 15 మంది కూడా జనాల్లో ఒక ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేశారు. ఐతే 15 మందిలో ప్రియా, శ్రీజ, పవన్ కళ్యాణ్, డీమన్ పవన్ , హరీష్, మనీష్ వెళ్లి అక్కడ గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. సెలబ్రిటీస్ కంటే కూడా వీళ్ళే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఈ ఆరుగురు కూడా స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో ఎం ఆడతార్రా బాబు అనిపించుకున్నారు కానీ లాస్ట్ కి వచ్చేసరికి అందరిలో ఒక ఇంటరెస్ట్ ని క్రియేట్ చేశారు. అలాగే అలాగే ఈ ఆరుగురితో పాటు ఎలిమినేట్ ఐన నాగప్రశాంత్, కల్కి, షాకిబ్, డాలియా, అనూష ఈ ఐదుగురు కూడా చాలా పోటాపోటీగా అగ్నిపరీక్షలో టాస్కులు ఆడారు.

మొదటి వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే!

బిగ్ బాస్ మొదటి వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది . ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో భరణి, ఇమ్మాన్యుయల్ ఇద్దరు ఉండగా భరణి సుత్తిని ముందుగా పట్టుకున్నాడు. దాంతో తను సంజనని నామినేట్ చేసి సుత్తిని శ్రీజకి ఇస్తాడు కానీ శ్రీజ సంజనని కాకుండా తనూజని నామినేట్ చేస్తుంది. నువ్వేం చేసిన యాక్టింగ్ చేసినట్లనిపిస్తుందని తనూజతో శ్రీజ అంటుంది. అలా తనూజ గురించి ఓనర్స్ అందరు ఒక్కొక్కరుగా పాయింట్స్ చెప్తారు. ఎవరైన అన్నం పెడుతుంటే అన్నపూర్ణలాగా ఉండాలి.. ఏదో చేస్తేస్తున్న ఇష్టం ఉంటే తినండి అన్నట్లు ఉంటుంది నీ బిహేవియర్ అని హరీష్ అనగానే తనూజ హర్ట్ అవుతుంది. మీ బాడీ లాంగ్వేజ్ బాలేదంటు మాస్క్ మెన్ హరీష్ అన్నాడు.