మధు అర్జెంటుగా మీ ఆవిడని కట్ చెయ్.. అమ్మో వీడు వైల్డ్ ఆర్టిస్ట్
ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి సూపర్ స్టార్స్ రి-యూనియన్ నిర్వహించారు. ఈ షోకి అలనాటి సీనియర్ సీరియల్ యాక్టర్స్ వచ్చారు. రాజ్ కుమార్, సునయన, సీనియర్ ఆర్టిస్ట్ మధుసూదన రావు-రుతురాగాలు శృతి, కౌశిక్, ఇంద్రనీల్ - మేఘన, సీనియర్ నటుడు ప్రదీప్, ప్రీతి నిగమ్ వంటి వాళ్లంతా వచ్చారు. శ్రీముఖి వీళ్లందరితో మంచి ఫన్ చేసింది. అలనాటి తారలతో అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం అంటూ చెప్పింది శ్రీముఖి..