English | Telugu

Jayam serial : వీరు కోసం వచ్చిన పోలీసులు.. గంగకి సపోర్ట్ గా పెద్దసారు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -54 లో.....పైడిరాజు నెక్లెస్ దొంగతనం చేసి గంగ తీసిందని తనపై నెట్టుతాడు. దాంతో రుద్ర ఒక ప్లాన్ చేస్తాడు. ఈ కిరోసిన్ గంగ, పైడిరాజు పోసుకోండి.. ఎవరైతే తప్పు చెయ్యలేదో వారికేం కాదని రుద్ర అనగానే గంగ పోసుకుంటుంది‌‌. పైడిరాజుకి బలవంతంగా పోస్తారు. ఇక చేసేదేమీ లేక తనే తీసానని పైడిరాజు ఒప్పుకుంటాడు. దాంతో ఇంట్లో అందరు తనపై కోప్పడతారు.

ఆ తర్వాత నువ్వే కదా ఈ ప్లాన్ చేసిందని ఇషికతో వీరు అంటాడు. ఏదో ట్రై చేశాను కానీ ఫెయిల్ అయిందని ఇషిక అంటుంది. ఆ తర్వాత ఇంటికి పోలీసులు వస్తారు. గంగ అనే అమ్మాయి భాను ప్రతాప్ గారిపై కంప్లైంట్ ఇచ్చింది. అతన్ని పిలవండి అని అంటారు. దాంతో అందరు షాక్ అవుతారు. గంగ అసలేం జరిగిందో అందరికి చెప్తుంది. ఒకమ్మాయిని గెస్ట్ హౌస్ కి రమ్మటుంటే నేను కాపాడను. కానీ ఆ కార్ లో ఉన్న వ్యక్తిని చూడలేదు కానీ నేను అతను ఉన్నా కార్ నంబర్ చూసాను.. మళ్ళీ నిన్న ఆ కార్ కనిపించింది.. అందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను కానీ ఆ కార్ భాను బాబుది అనుకోలేదని గంగ చెప్తుంది. ఇప్పుడు ఎవరు ఆ కార్ ని వాడుతున్నారని శకుంతల అడుగగా అబ్రాడ్ నుండి బిజినెస్ పని మీద వచ్చిన వాళ్ళకోసం వాడుతున్నాం.. వాళ్ళెవరో ఇలా చేసి ఉంటారని వీరు అంటాడు.

ఇంకొకసరి నా భాను కార్ ఎవరు వాడడానికి వీళ్ళేదని శకుంతల అంటుంది. ఎవరెవరు అబ్రాడ్ నుండి వచ్చారో అందరి లిస్ట్ చెయ్.. ఎవడో వాడు వాని సంగతి తెలుద్దామని పెద్దసారు అంటడు. గంగ బాధపడుతుంటే.. నువ్వు మంచిపని చేసావ్.. బిజినెస్ కోసం వచ్చిన వాళ్లలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని తెలిసి వచ్చిందని గంగతో పెద్దసారు అంటాడు. ఆ తర్వాత తెల్లవారితే రుద్ర ఫైనల్ హియరింగ్ ఉంటుంది. దాంతో రుద్ర దగ్గరికి పెద్దసారు వచ్చి మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.