English | Telugu

ఆనంద్ దేవరకొండతో ఢీ డాన్సర్  నైనిక!

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా అలాగే ఢీ డాన్సర్ గా నైనికా అందరికీ పరిచయమే. ఇక ఆమె సోషల్ మీడియాలో చేసే రీల్స్ కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి నైనిక కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు సమాధానాలు ఇలా చెప్పింది. "నేటివ్ ఐతే వైజాగ్ పుట్టింది ఒరిసాలో సెటిల్ అయ్యింది హైదరాబాద్ లో. మిడిల్ క్లాస్ ఫామిలీ మాది. పదవ తరగతి నుంచి నేను నా డ్రీమ్స్ ని వెతుక్కుంటూ వచ్చాను. ఢీ నాకో మంచి పేరు తెచ్చిపెట్టింది. కాలేజ్ కి నేను వెళ్ళలేదు కానీ  స్కూల్ లో శుభం అనే అబ్బాయి లవ్ లెటర్ లాంటిది ఇచ్చాడు. అందులో నైనిక అండ్ శుభం కిస్స్డ్ అని ఉంది. అది స్కూల్ మొత్తం తెలిసిపోయింది. కానీ అలాంటివి ఏమీ జరగలేదు. నేనొక డీసెంట్ స్టూడెంట్ ని." అని చెప్పింది నైనిక. "యానిమల్స్ డాన్స్ చేయగలిగితే బెస్ట్ డాన్సర్ అవార్డు దేనికి ఇస్తారు" అన్న ప్రశ్నకు "ఎలిఫేంట్" అని చెప్పింది. "సంకేత్ తో ఎక్కువగా పెర్ఫెర్మెన్సులు చేసాను కాబట్టి సంకేత్ బెస్ట్ పెర్ఫార్మర్. అమ్మ నా ఇన్స్పిరేషన్. ఆమె చిన్నప్పటి నుంచి నన్ను ఇంతవరకు ఎలా తీసుకొచ్చింది అనేది నాకు తెలుసు కాబట్టి ఆమెలా స్ట్రాంగ్ గా ఉంటే చాలు అనుకుంటాను.

Karthika Deepam2 : ప్రాణధాత దీపే అని నిరూపించిన కార్తీక్.. తనని సుమిత్ర క్షమిస్తుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -467 లో.....శౌర్య నీ కన్నకూతురు కాకున్నా అన్ని బాగా చేస్తున్నావని జ్యోత్స్న అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ జ్యోత్స్న నీకేం అర్హత ఉందని వాళ్ళ గురించి మాట్లాడుతున్నావని తనపై దశరథ్ కోప్పడతాడు. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని ఇక్కడ ఒక్కరిచేత అనిపించమని జ్యోత్స్న అనగానే నువ్వు మాట్లాడింది తప్పు అని పారిజాతం అంటుంది. నీకు రక్తబంధం గురించి ఏం తెలుసు.. కొంతమంది పెంచుకున్న కూడా కన్నవాళ్లకంటే ఎక్కువ చూసుకుంటారని జ్యోత్స్నకి పారిజాతం కౌంటర్ వేస్తుంది.