Illu illalu pillalu : సాగర్ కి ఎగ్జామ్.. ప్రేమని చూసిన శ్రీవల్లి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -258 లో..... నర్మద, సాగర్ హాల్ టికెట్ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారు. నేను నాన్న గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నానని సాగర్ అనగానే వద్దు సాగర్ రిస్క్ అని నర్మద అంటుంది. లేదు నర్మద తీసుకుంటానని సాగర్ అంటాడు. అదంతా శ్రీవల్లి చూస్తుంది. వీళ్ళేదో చేస్తున్నారు..అదేంటో తెలుసుకోవాలని శ్రీవల్లి అనుకుంటుంది.