హిందీ బెల్ట్ కి షాక్ ఇచ్చిన మిరాయ్
సెప్టెంబర్ 5 న పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టి ఘన విజయాన్ని అందుకున్న చిత్రం 'మిరాయ్'(Mirai).శ్రీరాముడు ఆయుధమైన మిరాయ్ కి, కళింగ సామ్రాట్ అశోకుడి శక్తులకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే పాయింట్ తో తెరకెక్కి, అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. తేజ సజ్జ(Teja Sajja)మంచు మనోజ్(Manchu Manoj)శ్రేయ, రితికా నాయక్, జగపతి బాబు, కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamneni)టిజె విశ్వప్రసాద్(TG Vishwa Prasad)వంటి ప్రతిభావంతుల కలయికతో అద్భుతమైన చిత్రంగా నిలవడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని 'విశ్వవ్యాప్తం' చేసింది.