English | Telugu

దసరా రోజున బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన ‘అఖండ2’ టీమ్‌.. ఇది ఫ్యాన్స్‌కి పండగే!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సింహా, లెజెండ్‌, అఖండ వంటి భారీ బ్లాక్‌బస్టర్స్‌తో హ్యాట్రిక్‌ సాధించారు. ఇప్పుడు రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుడుతూ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ2: తాండవం’ చిత్రంపై మొదటి నుంచీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 25న విడుదల చెయ్యాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను వాయిదా వేశారు. విజయదశమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ విడుదల తేదీని కూడా రివీల్‌ చేశారు.

డిసెంబర్‌ 5న ‘అఖండ2’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి ఈ డేట్‌కి ప్రభాస్‌, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజాసాబ్‌’ విడుదల కావాల్సి ఉంది. దీన్ని జనవరి 9కి పోస్ట్‌ పోన్‌ చేశారు. ఇప్పుడా డేట్‌కి ‘అఖండ2’ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. గతంలో విడుదలైన టీజర్‌ అందర్నీ ఆకట్టుకుంది. సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. విజయదశమి రోజున విడుదల చేసిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో పొడవాటి జుట్టు, గడ్డంతో, మెడలో రుద్రాక్షలు ధరించిన బాలకృష్ణ ఎంతో గంభీరంగా కనిపిస్తున్నారు. దీంతో ‘అఖండ2’ మరో సెన్సేషన్‌ క్రియేట్‌ చేయబోతోందని నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.