English | Telugu

నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న 'అగ్లీ స్టోరీ' ఇంటెన్స్ టీజర్ విడుదల

నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'అగ్లీ స్టోరీ'. రియా జియా ప్రొడక్షన్స్ పతాకం మీద సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌, 'హే ప్రియతమా' లిరికల్ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ తాజాగా ఈ చిత్రం నుంచి ఇంటెన్స్ టీజర్ రిలీజ్ చేశారు.

మంటల మీదుగా సిగరెట్ కాలుస్తున్న నందును 'అగ్లీ స్టోరీ' టీజర్‌లో ముందుగా పరిచయం చేశారు. అతడిది పర్వర్ట్ క్యారెక్టర్ అన్నట్టు సన్నివేశాలు ఉన్నాయి. తర్వాత అవికా గోర్ పరిచయం జరిగింది. నందును కాకుండా అవికా గోర్ మరొక అబ్బాయిని ప్రేమిస్తుంది. మరొకరిని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నామనిఅవికా గోర్ చెప్పినా సరే నందు వదలడు. వేధిస్తాడు. 'వాళ్ళదిప్రేమ, అందుకే కలుసుకున్నారు. నీది కోరిక, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావ్' అని డైలాగ్ వస్తుంటేస్క్రీన్ మీద అవికా గోర్ - రవితేజ మహాదాస్యంపెళ్లిని, మెంటల్ ఆస్పత్రిలో నందునుచూపించారు. కథలో ట్విస్టులతో పాటు చివర్లో అవికా గోర్ ప్రేమ కోసం నందు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? అనేది సినిమాలో చూడాలి.

నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శివాజీ రాజా, రవితేజ మహదాస్యం, ప్రజ్ఞ లాంటి టాలెంటెడ్ కాస్ట్ నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా శ్రీ సాయికుమార్ దారా, ఆర్ట్ డైరెక్టర్ గా విఠల్ కోసనం, ఎడిటర్స్ గా శ్రీకాంత్ పట్నాయక్, సోమ మిథున్ వ్యవహరిస్తున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.