English | Telugu

చిరుని, నయనతారను కలిసిన డాన్సర్ మురళి....

ఢీ 20 ఈ వారం ఎపిసోడ్ లో చాలా గుడ్ న్యూస్ లు వినిపించాయి. ఇందులో ముఖ్యంగా సోషల్ మీడియాలో చిరంజీవి సాంగ్స్ కి చేసిన డాన్సస్ తో వైరల్ ఐన మురళి బాబాయ్ సెగ్మెంట్. నాగబాబు ప్రామిస్ చేసినట్టుగా మురళి బాబాయ్ ని చిరంజీవితో కల్పించారు. ఇంకా బాబాయ్ వెళ్లి ఆయన కాఫీ తాగి మాట్లాడారు అలాగే ఆయన ముందు కొన్ని స్టెప్పులు వేసి చూపించారు. ఈ విషయం గురించి మురళి బాబాయ్ మాట్లాడుతూ "ఆయన్ని చూస్తుంటే పరమేశ్వరుడిని చూసినట్టు ఉంది. సినిమా షూటింగ్ చేసి వస్తుంటే కుర్రోడిలా ఉన్నారు. అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా సంతోషంగా ఉంది. మురళి గారు ఏడవకండి మీ లైఫ్ బాగుంటుంది. సర్ ఇంకా చనిపోతే చాలు సర్ నాకు. ఎలాగైనా కలవాలి అనుకున్న అవకాశం ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు.

కాంతార చాప్టర్ 1 ,కొత్తలోక చాప్టర్ 1 ఎవరు గెలిచారు.. ఒక్క పాయింట్ తేడా అంతే  

కాంతార చాప్టర్ 1(kanthara chapter 1)కొత్తలోక చాప్టర్ 1(kotha lokah chapter 1)ఈ రెండు చిత్రాలు సాధించిన విజయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రెండు భిన్నమైన జోనర్స్ తో తెరకెక్కి పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద విజయదుందుభి మోగించాయి. మేకింగ్, కంటెంట్ పరంగా  పాన్ ఇండియా మేకర్స్ ముందు ఎన్నో సవాళ్ళని కూడా ఉంచాయి.ఒకసారి సినిమా చూడటానికే థియేటర్స్ కి ప్రేక్షకులు పెద్దగా రాని ఈ రోజుల్లో రిపీట్ ఆడియెన్స్ ని థియేటర్స్ కి పరుగులు తీయించాయి. దీన్ని బట్టి ఆ చిత్రాలు ఎంత బలమైన ప్రభావాన్ని చూపించాయో అర్ధం చేసుకోవచ్చు.

పెద్ది లో చిరంజీవి సీనియర్ హీరోయిన్!.. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సలహా 

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)వన్ మాన్ షో ' పెద్ది'(Peddi)వచ్చే ఏడాది మార్చి 26 న థియేటర్స్ లో ల్యాండ్ అవ్వనుంది. కానీ రీసెంట్ గా రిలీజ్ చేసిన 'చికిరి'(Chikiri) సాంగ్ తో ఇప్పటినుంచే పెద్ది సందడి వాతావరణం అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో నెలకొని ఉంది. కాస్టింగ్ పరంగా కూడా అభిమానులకి మరింత కనువిందు కలిగించనుంది. అందుకు తగ్గట్టే కన్నడ సూపర్ స్టార్ 'శివరాజ్ కుమార్' (shiva rajkumar)గౌర్ నాయుడుగా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. జగపతి బాబు, దివ్యేన్ధు శర్మ వంటి ప్రతిభావంతమైన నటులు కూడా ప్రాముఖ్యత గల క్యారక్టర్ లలో కనిపిస్తున్నారు.